English   

కమల్ హాసన్ అన్నంత పని చేశాడు..!!

kamal hasan - 01
2018-07-04 15:29:02

అతనో మామూలు యువకుడు. కేరళలోని ఓ గ్రామానికి చెందినవాడు. కానీ పాటగాడు. అలాగని ప్రొఫెషనల్ సింగర్ కాదు. కాకపోతే ప్రొఫెషనల్ గా పాడటంలో సాధన చేశాడు. ఆ మధ్య తన పొలంలోనో మరెక్కడో కూర్చుని ఓ పాట పాడాడు. అది కూడా కమల్ హాసన్ సినిమాలోని తమిళ పాట. దీన్ని అతని ఫ్రెండ్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది మెల్లగా ట్విట్టర్ వరకూ చేరింది. ఈ పాట విన్న సంగీత దర్శకుడు గిబ్రన్ ఫిదా అయిపోయాడు. అతని వాయిస్ తో పాటు టోన్ రెండరింగ్ అద్భుతం అంటూ అతని ఫోన్ నెంబర్ కావాలని రిక్వెస్ట్ చేశాడ. అంతే కాదు.. ఈ పాట కమల్ కూడా విన్నాడు.. అతన్ని కలవాలనుకుంటున్నాడు అని చెప్పాడు. అంతే.. గిబ్రన్ చేసిన ట్వీట్ కు వందలాదిమంది రియాక్ట్ అయ్యారు.

అతని పేరు రాకేష్ ఉన్ని. అతన్ని పిలిపించడమే కాదు.. ఆ పాట ఒరిజినల్ గా పాడిన శంకర్ మహదేవన్ కు కూడా ఈ వీడియోను వాట్సాప్ లో పంపించాడు కమల్ హాసన్ . మొత్తంగా మరోసారి కమల్ హాసన్ సమక్షంలో అత్యంత అడ్మైరింగ్ ఆ పాట పాడిన రాకేష్ ఉన్ని.. తన ఆనందాన్ని దాచుకోలేకపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రన్ అతనికి విశ్వరూపం-2లో ఓ పాట పాడే అవకాశం ఇవ్వబోతున్నాడు. విశ్వరూపం కు కుదరకపోతే ఖచ్చితంగా తన నెక్ట్స్ సినిమాలో సింగర్ గా ఛాన్స్ ఇస్తా అన్నాడు. మొత్తంగా కమల్ హాసన్ అతన్ని పిలిపించమని చెప్పడమే కాదు.. అతని ప్రతిభను వెలుగులోకి తెచ్చి.. ప్రపంచానికి చూపించాడు. ఈ సందర్భంగా కేరళీయులంతా హ్యాట్సాఫ్ కమల్ సర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక ఊహించని ఈ పరిణామంతో రాకేష్ ఉన్న ఓవర్ నైట్ సెలబ్రిటీ రేంజ్ కు మారిపోయాడు. ఇప్పుడు అతని ఇంటర్వ్యూస్ కోసం కేరళ మీడియా తెగ హడావిడీ చేస్తోంది. సో.. టాలెంట్ చాలామందికి ఉంటుంది. కానీ అది వెలుగులోకి రావాలంటే అదృష్టం ఉండాలి. రాకేష్ కు ఆ అదృష్టం కమల్ రూపంలో వచ్చింది. 

More Related Stories