English   

క‌ణం ఎందుకు ఆల‌స్యం అవుతుంది..?

kanam movie
2018-02-20 11:28:02

ఎప్పుడో మూన్నెళ్ల కిందే పూర్తైన షూటింగ్.. స్టార్ క్యాస్టింగ్.. లైకా ప్రొడ‌క్ష‌న్ హౌజ్.. ఇంత ఉన్నా కూడా ఎందుకో కానీ క‌ణం సినిమా అనుకున్న టైమ్ కు రావ‌డం లేదు. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు వాయిదా ప‌డింది ఈ చిత్రం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుంటే ఆ పాటికి సినిమా వ‌చ్చి కూడా చాలా కాల‌మే అయ్యుండేది. కానీ రాలేదు. దానికి కార‌ణం కూడా తెలియ‌డం లేదు. ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 9న ఈ సినిమా వ‌స్తుంద‌ని వాళ్లే అనౌన్స్ చేసారు.. ఆ త‌ర్వాత తేదీని 23కి మార్చారు. కానీ ఇప్పుడు ఆ తేదీన కూడా సినిమా రావ‌డం లేదు. మ‌రో ప‌ది రోజుల పాటు సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు అనౌన్స్ చేసారు క‌ణం నిర్మాత‌లు. ఇప్పుడు మాత్రం క‌చ్చితంగా కావాల‌నే ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసారు. ఛ‌లో స‌క్సెస్ ను చూపించి క‌ణం సినిమాను ఎక్కువ‌కు అమ్ముతున్నార‌ని తెలుస్తుంది. ఇందులో సాయిప‌ల్ల‌వితో పాటు నాగ‌శౌర్య న‌టించాడు. ఇప్పుడు ఇద్ద‌రి ఇమేజ్ హైలోనే ఉంది. 
అబార్ష‌న్.. ఆడ‌పిల్ల‌ల‌ను క‌డుపులోనే చంపేయ‌డం.. ఇలాంటి కాంట్ర‌వ‌ర్సియ‌ల్ కాన్సెప్ట్ తో విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నాడు నాగ‌శౌర్య‌. మా సారీ మా.. నేను చేసింది తప్పే. అలా అని ఇది వద్దమ్మా.. ప్లీజ్‌ అనే డైలాగ్ వింటుంటే క‌డుపులో ఉన్న పిండం అమ్మ‌ను వేడుకుంటున్న‌ట్లు అనిపిస్తుంది. సాయిపల్లవి డైలాగ్స్ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయం. ఎవరో హత్యకు గురి కావడం.. హంతకుడి కోసం పోలీసులు గాలించడం.. ఇంటిలో క్షుద్ర పూజలు చేయడం.. ఇవ‌న్నీ క‌ణం సినిమాపై అంచ‌నాలు.. ఆస‌క్తి పెంచేస్తున్నాయి. కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. క‌ణంలో సీరియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు. త‌మిళ్లో ఇదే పాత్ర‌ను ఆర్ జే బాలాజీ న‌టిస్తున్నాడు. ఓ పాప చుట్టూ ఈ క‌థ అల్లుకున్నాడు విజ‌య్. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న సాయిప‌ల్ల‌వి క‌ణంకు ప్రాణంగా నిలిచింది. మొత్తానికి చూడాలిక‌.. మార్చ్ 3న అయినా క‌ణం వ‌స్తుందో రాదో..?

More Related Stories