English   

 ప్రివ్యూ: క‌ణం

Kanam-movie-Preview

క‌ణం.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇందులో ఇద్ద‌రు హిట్స్ లో ఉన్న హీరో హీరోయిన్లే ఉన్నారు. ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత నాగ‌శౌర్య నుంచి వ‌స్తోన్న సినిమా ఇది.. ఇక సాయిప‌ల్ల‌వి గురించి ఏం చెప్పాలి..? ఈమె ఉందంటే ఇప్పుడు సినిమా హిట్ అంతే. ఈ సినిమాలో తాను న‌టించ‌లేదు.. ద‌ర్శ‌కుడు విజ‌య్ న‌న్న‌స‌లు న‌టించ‌నివ్వ‌లేదంటోంది సాయిప‌ల్ల‌వి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇది తల్లి, కూతురికి ఉండే భావోద్వేగాల మ‌ధ్య న‌డిచే క‌థ‌. విజయ్‌ ఈ కథ చెప్పిన‌పుడు ముందు ఒక్క క్ష‌ణం ఆలోచించుకున్నాన‌ని చెప్పింది ప‌ల్ల‌వి. ఎందుకంటే త‌ల్లి పాత్ర కాబ‌ట్టి తాను చేయ‌గ‌ల‌నా లేదా అనే అనుమానం అయితే వ‌చ్చింది త‌న‌కు అనేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిప‌ల్ల‌వి చేసిన పాత్ర‌ల‌న్నీ యూత్ ఫుల్ రోల్సే. అంతా కుర్రాళ్ల గుండెల్ని మాయ చేసాయి. ఫిదా.. ఎంసిఏ లాంటి తెలుగు సినిమాల‌తో ఇక్క‌డ స్టార్ అయిపోయింది ప‌ల్ల‌వి. చాలా వాయిదాల అనంత‌రం ఇప్పుడు విడుద‌ల‌వుతుంది క‌ణం. నిజానికి గ‌తేడాదే రావాల్సిన ఈ చిత్రం అనుకోని కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూనే వ‌స్తుంది. ఎప్రిల్ 27న విడుద‌లవుతుంది క‌ణం. త‌మిళ‌ణాట దియాగా వ‌స్తుంది ఈ చిత్రం. సాయిప‌ల్ల‌వి క్రేజ్ ఈ సినిమాకు బ‌లం అని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?
 

More Related Stories