English   

కాలా డేట్ లో ‘కణం’

Kanam-release
2018-04-21 17:10:49

నాగశౌర్య వివాదాస్పద సినిమా.. సాయి పల్లవి మెయిన్ సెంట్రిక్ లో నటించిన సినిమా కణం. విజయ్ దర్శకత్వం వహించిన ఈ బై లింగ్వుల్ మూవీ సడెన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుంది. ఫిబ్రవరి నుంచి రిలీజ్ డేట్ కోసం ట్రై చేస్తోన్న కణం ఫైనల్ గా కాలా డేట్ కు వచ్చేస్తోంది. యస్.. ఈ నెల 27న కణం విడుదలవుతోంది. ఈ సినిమా టైమ్ లోనే సాయి పల్లవికి, నాగశౌర్యకు మధ్య చెడింది. ఆ విషయం ఓపెన్ గానే చెప్పాడు శౌర్య. అలాంటి హీరోయిన్ ను ఇంత వరకూ చూడలేదు అని కాస్త ఘాటుగానే మాట్లాడాడు. అయితే ఈ వివాదంపై సాయి పల్లవి మాత్రం పాజిటివ్ గా స్పందించింది. తానెవరినీ హర్ట్ చేయాలని చేయలేదు. ఎవరైనా తన వల్ల హర్ట్ అయితే సారీ అనేసింది. కానీ ఆ సారీకి శౌర్య కూల్ కాలేదు. అందుకే ఈ మూవీకి సంబంధించిన ఏ ప్రమోషన్ కూ(ఆఖరుకి ఆడియో రిలీజ్ కు) సైతం అటెండ్ కావడం లేదు. మరి ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయింది కాబట్టి ఇకనైనా ప్రమోషన్స్ కు సహకరిస్తాడా లేదా అనేది చూడాలి. లైకా ప్రొడక్షన్స్ వంటి భారీ నిర్మాణ సంస్థ నిర్మించిన కణం భ్రూణ హత్యల నేపథ్యంలో వస్తోన్న కథ అనే ఊహాగానం ఉంది. మరికొందరు సరోగసీ నేపథ్యం అంటున్నారు. ఏదేమైనా ఇది హీరోయిన్ సెంట్రిక్ మూవీ. కాస్త హెవీ సెంటిమెంట్ కూడా దట్టించినట్టు ట్రైలర్ చూస్తేనే తెలిసింది. మరి ఈ నెల 27న పెద్దగా పోటీ లేదు. కాబట్టి కణం.. కలెక్షన్లు సాధిస్తుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories