English   

కాంచన-3 రిలీజ్ డేట్ కన్ఫర్మ్

Kanchana-3-release
2018-08-10 17:19:31

సౌత్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ సిరీస్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా కాంచన నే. తొలి సినిమా ముని తర్వాత కాంచన పేరుతో కంటిన్యూ అవుతోన్న ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటి వరకూ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సినిమా థీమ్ మారకుండా వైవిధ్యమైన కథలతో వస్తోన్న రాఘవ లారెన్స్.. ప్రతి సినిమాతో భయాన్ని పెంచుతున్నాడు. కంటెంట్ తోనూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే ఈ ఇప్పటి వరకూ వచ్చిన మూడు సినిమాల్లో(మునితో కలిపుకుని) అతను ఎంచుకున్న హీరోయిన్లంతా ఆల్మోస్ట్ ‘‘వైట్ బ్యూటీసే’’. తను బ్లాక్ ఉండటంతో తన సినిమాల్లో ఎక్కువగా వైట్ బ్యూటీస్ తోనే రొమాన్స్ చేస్తాడు లారెన్స్ అనేవాళ్లూ లేకపోలేదు. మొత్తంగా ప్రస్తుతం కాంచన-3  షూటింగ్ లో ఉన్నాడు లారెన్స్ .. లేటెస్ట్ గా ఈ భాగం విడుదల తేదీని ప్రకటించాడు. ఈ సారి కూడా హారర్ అండ్ కామెడీ మిక్స్ అయిన కాన్సెప్ట్ తోనే ఈ కాంచన -3ని తెరకెక్కించాడు లారెన్స్.. ఈ మూవీలో తన సరసన లాస్ట్ ఇయర్ తమిళ్ బిగ్ బాస్ సీజన్ లో హల్చల్ చేసిన ఓవియా హీరోయిన్ గా నటిస్తోంది. తనతో పాటు ఈ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ మునిలో నటించిన వేదికను మరోసారి తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీని డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు లారెన్స్ .. అంటే ఇయర్ ఎండింగ్ ను హారర్ తో ఫినిష్ చేస్తాడన్నమాట. 

More Related Stories