English   

జయ బయోపిక్...భారీ రెమ్యునరేషన్ తో కంగనా ఇన్ !

Kangana is charging Rs 24 crore for Jayalalitha biopic
2019-03-25 02:44:23

ప్రస్తుతం అన్ని బాషలలో రీమేక్స్, బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు బయోపిక్స్, రీమేక్స్ రెండూ విడుదలయి మంచి కలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే ఈ సారి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్స్ ఎక్కువ సంఖ్యలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇందులో నిత్యామీన‌న్ లీడ్ రోల్ పోషిస్తున్నట్టు కూడా ఆ తర్వాత రోజుల్లో ప్రకటన వచ్చింది. ఇక ఈ మధ్యనే త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్ తాను త‌లైవీ అనే టైటిల్‌తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌కెకక్కించబోతున్నానని ప్ర‌క‌టించాడు. మొన్న మహానాయకుడు, కధా నాయకుడు సిరీస్ సినిమాలకి సహా నిర్మాతగా వ్యవహరించియన వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి బాహుబలి, మణికర్ణిక, భజరంగీ భాయిజాన్ సినిమాలకి కధ అందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కంగనాని జయ పాత్రలో అనుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు కంగ‌నా ర‌నౌత్ ఏకంగా 24 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేసింద‌ట‌. మణికర్ణికతో హిట్ కొట్టి ఫాంలో ఉన్న కంగ‌నాకి నిర్మాత‌లు ఆమె కోరిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని చెబుతున్నారు. ఈ సినిమాని త‌మిళ, హిందీ, తెలుగు భాష‌ల‌లో ఒకేసారి విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ని సమాచారం.

More Related Stories