English   

హీరోయిన్ ప్రాణాలతో ఆడుకుంటున్న క్రిష్..

kangana ranaut
2018-03-03 15:05:15

మ‌న క్రిష్ ఏంటి.. హీరోయిన్ ప్రాణాల‌తో ఆడుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఆయ‌న కూడా కావాల‌ని చేసింది క‌దా.. కానీ ఇప్ప‌టికే రెండుసార్లు ఓ స్టార్ హీరోయిన్ ప్రాణాల‌తో ఆడుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆమె మ‌రెవ‌రో కాదు కంగ‌న ర‌నౌత్. ప్ర‌స్తుతం ఈమె కీల‌కపాత్ర‌లో మ‌ణిక‌ర్ణిక సినిమా చేస్తున్నాడు క్రిష్. ఈ చిత్రంలో ఈమె ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ గా న‌టిస్తుంది. ఈ పాత్ర కోసం ప్రాణం పెట్ట‌డం కాదు.. తీసుకోడానికి కూడా రెడీ అనేసింది ఈ ముద్దుగుమ్మ‌. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌ను భుజాన మీద వేసుకుని న‌డిపిస్తున్న హీరోయిన్ల‌లో కంగన కూడా ఒక‌రు. ఈమెకు హీరోల‌తో ప‌నిలేని ఇమేజ్ ఉంది. ఇప్పుడు మ‌ణిక‌ర్ణిక‌పై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమాలో కొన్ని యుద్ధ స‌న్నివేశాల కోసం శిక్ష‌ణ తీసుకుంది కంగ‌న‌. కానీ షూటింగ్ టైమ్ లో జ‌రిగిన చిన్న చిన్న పొర‌పాట్ల వ‌ల్ల ఓ సారి ముక్కుకు.. మ‌రోసారి నుదిటికి గాయాలయ్యాయి. దాని గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ప‌ది రోజుల్లో మ‌ళ్ళీ షూటింగ్ కు వ‌చ్చేసింది కంగ‌న‌. ఈ విష‌యంపై మాట్లాడుతూ.. చిత్ర టైటిల్‌ను చూస్తే అర్థమవుతుంది ఇది యుద్ధం నేపథ్యంలో సాగే చిత్రమని.. అందులోనూ త‌న పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుంద‌ని ముందే తెలుస‌ని.. అందుకే అన్నీ సిద్ధ‌ప‌డే వ‌చ్చానంటుంది కంగ‌న‌. ఈ పాత్ర చేస్తూ దాదాపు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వ‌చ్చింది అని త‌న అనుభ‌వాల‌ను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఎంత క‌ఠినంగా ఉన్నా కూడా ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ పాత్ర‌కు న్యాయం చేయ‌డ‌మే త‌న‌కు కూడా కావాలంటుంది కంగ‌న‌. ఈ చిత్రం ఎప్రిల్ 27న విడుద‌ల కానుంది.

More Related Stories