English   

కంగనాకు లాయర్ బెదిరింపులు..నడీ రోడ్డుపై రేప్ చేస్తా అంటూ

Kangana Ranaut
2020-10-21 18:07:25

ప్రస్తుతం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో ఉంటూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు ఇండస్ట్రీ లోని నెపోటిజమే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలతో కంగనా కు నెటిజన్లు మద్దతు పలుకగా బాలీవుడ్ లోని పలువురు ఆమె వ్యాఖ్యలను విమర్శించారు. ఇక ఆ వివాదం తరవాత కంగన మహా సర్కార్ పై సైతం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దాంతో ముంబై లో కంగనా అక్రమంగా ఆఫీస్ నిర్మించిందంటూ శివసేన సర్కార్ కూల్చివేసింది. దాంతో కంగనా వర్సెస్ మహా సర్కార్ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో కంగనాకు బెదిరింపులు మొదలయ్యాయి. కాగా ఇటీవల కంగనా తన సోదరుడి వివాహ వేడుక నేపథ్యంలో బిజీగా వుంది. 

తన సోదరుడి వివాహానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయతే కంగనా షేర్ చేసిన ఫోటోలకు ఒడిస్సాకు చెందిననూ లాయర్ నుండి నాడీ రోడ్డుపై రేప్ చేస్తానంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ విషయం పై తాజాగా సదరు లాయర్  క్లారిటీ ఇచ్చారు. తన ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసారని ఆయన పేర్కొన్నారు. తాను ఎలాంటి కామెంట్ చేయలేదని...తన అకౌంట్ నుండి వచ్చిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించాలని కోరారు. అంతేకాకుండా ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ ను సైతం డిలీట్ చేసారు. ఇక ఈ విషయం పై కంగనా మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

More Related Stories