English   

శ్రీ‌రెడ్డికి కంగ‌న క్లాస్.. 

Kangana-Sri-Reddy
2018-04-11 09:52:41

శ్రీ‌రెడ్డి.. ఇన్నాళ్లూ తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా స‌రిగ్గా తెలియ‌ని పేరు ఇది. కానీ ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ గా పాపులర్ అయిపోయింది. అది కూడా ఒక్క ప‌ని వ‌ల్ల‌. అవ‌కాశాలు రావ‌ట్లేదు.. తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగమ్మాయిల‌ను తొక్కేస్తున్నారు.. క్యాస్టింగ్ కౌచ్.. ఇలా నిర‌స‌న‌తో శ్రీ‌రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో పాపులర్ అయిపోయింది. దాంతో ఈ భామ‌కు కొన్ని వర్గాల నుంచి స‌పోర్ట్ వ‌స్తుంది.. కానీ మేజ‌ర్ పార్ట్ మాత్రం శ్రీ‌రెడ్డికి వ్య‌తిరేకంగానే ర‌చ్చ జ‌రుగుతుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ కూడా శ్రీ‌రెడ్డి తీరును త‌ప్పుబ‌ట్టింది. ఆమె అడ్ర‌స్ చేస్తోన్న పాయింట్ స‌రైందే అయినా.. వెళ్తున్న దారి మాత్రం త‌ప్పు అని చెప్పింది కంగ‌న‌. ప్ర‌తీ ఇండ‌స్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని.. అన్నిచోట్లా అమ్మాయిలు ఆఫ‌ర్ల కోసం ఇబ్బందులు ప‌డుతున్నారని.. తాను కూడా ఆ బాధ‌లు ప‌డ్డాన‌ని చెప్పింది కంగ‌న‌. కానీ శ్రీ‌రెడ్డి చేసిన తీరు మాత్రం అవ‌మాన‌కరంగా ఉంది అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న అనేది స‌రైంది కాద‌ని.. అలా చేయ‌డం వ‌ల్ల ఆమెకు స‌పోర్ట్ చేయాల‌నేవాళ్లు కూడా చేయ‌ర‌ని చెప్పింది ఈ భామ‌. నిర‌స‌న తెల‌ప‌డానికి చాలా మార్గాలు ఉంటాయ‌ని.. అలాగ‌ని ఇలా చేయ‌డం మాత్రం త‌ప్ప‌ని శ్రీ‌రెడ్డిని త‌ప్పుబ‌ట్టింది కంగ‌నా ర‌నౌత్.

More Related Stories