English   

సెన్సార్ పూర్తి చేసుకున్న త‌లైవి

Thalaivi
2021-06-23 17:07:10

బయోపిక్ ల‌కు ప్ర‌స్తుతం గిరాకీ భాగా పెరిగిపోయింది. మొదట్లో బాలీవుడ్ లోనే ఎక్కువగా బ‌యోపిక్ లు వ‌చ్చేవి గానీ ప్ర‌స్తుతం అన్ని భాషల్లోనూ తెర‌కెక్కుతున్నాయి. అంతే కాకుండా మంచి విజ‌యాల‌ను అందుకుంటున్నాయి. ఈనేప‌థ్యంలోనే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. తమిళులు ముద్దుగా 'పురచ్చి తలైవి' గా పిలుచుకునే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జయలలిత పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన  ప్రచార చిత్రాలు సినిమాపై జనాల్లో అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 23 న తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కరోనా వల్ల సినిమా వాయిదా పడింది. 

తాజాగా 'తలైవి' తమిళ భాషకు సంబంధించిన సెన్సార్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా సినిమాకు 'U' సర్టిఫికెట్ వ‌చ్చిన‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. త్వ‌రలోనే తెలుగు, హిందీ భాషల కు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తి చేసుకుంటామని... ఆ తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇక ఈ సినిమాకు పాన్ ఇండియా రచయితగా పేరు తెచ్చుకున్న విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఈ కథలో జయలలిత రాజకీయ ప్రస్థానం, మరియు తమిళులకు అమ్మ గా ఎదిగిన విధానాన్ని, ఎంజీఆర్ కు జయలలితకు మధ్య ప్రేమను, సన్నిహిత్యాన్ని చూపించబోతున్నారు. ఈ సినిమాలో లో ఎంజీఆర్ గా అరవింద స్వామి, జయలలిత తల్లిగా భాగ్యశ్రీ, కరుణానిధి గా సముద్రఖని నటించారు, ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు జి.వి ప్రకాష్ స్వరాలు సమకూర్చారు. విష్ణువర్ధన్ ఇందూరి శైలేష్ ఆర్ సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories