జైళ్లో ఉన్న హీరోయిన్ కు బెయిల్

2021-01-21 15:14:31
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేదికి బెయిల్ మంజూరు అయ్యింది. కన్నడ చిత్రసీమకు చెందిన నటి రాగిణి ద్వివేదికి గురువారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రాగిణి.. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టును పలుమార్లు కోరింది. అయితే.. కేసు ప్రస్తుతం విచారణలో ఉందని ఇలాంటి సమయంలో నటి రాగిణికి బెయిల్ మంజూరు చేస్తే ఆమె బయటకు వచ్చి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది రాగిణి. ఆమె వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. నాలుగు నెలలపాటు జైళ్లో ఉన్న రాగిణి.. విడుదల కాబోతున్నారు.