English   

కరణ్ జోహార్ ఇంట్లో కరోనా కలకలం

Karan Johar
2020-05-26 12:43:48

బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. ఇటీవల బోని కపూర్ ఇంట్లో పని ఇద్దరికీ పాజిటివ్ అని తేలగా, నిన్న బాలీవుడ్ సీనియర్ నటుడు కిరణ్ కుమార్ కు కూడా కరోనా సోకింది. అయితే ఇప్పుడు తాజాగా మరో ప్రముఖుడి ఇంట్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్. ఆయన ఇంట్లో పని చేసే ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం వారికి కావాల్సిన వైద్య సేవలు అందిస్తున్నట్లు కరణ్ పేర్కొన్నారు. వారిని ఐసోలేషన్‌కు తరలించిగా, ప్రస్తుతం కరణ్ ఫ్యామిలి హోం క్వారంటైన్ లో ఉన్నట్టుగా ఆయన వెల్లడించారు. 

ఇక ఈ విషయాన్ని బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కు తెలియజేశామన్న ఆయన తన బిల్డింగ్ మొత్తాన్ని రసాయనాలతో శుభ్రం చేశారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఏమేం మందులు పిచికారీ చేయాలో ఆయా మందులు పిచికారి చేసినట్టు ఆయన పేర్కొన్నేరు. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా ఇంట్లో వాళ్లంద‌రం 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉంటామని పేర్కొన్నారు. క‌రోనా సంక్షోభంలో ప్రతీ ఒక్కరం ప్రభుత్వం సూచించిన నిబంధ‌న‌లను పాటిస్తే క‌రోనాను ధీటుగా ఎదుర్కోవ‌చ్చని అంద‌రూ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి అంటూ క‌ర‌ణ్ ట్వీట్ చేశారు.

More Related Stories