English   

ప్రివ్యూ: క‌ర్త‌వ్యం

Karthavyam-Preview

పెళ్లిచూపులు సినిమాతో ఇండ‌స్ట్రీలో కొత్త ఒర‌వ‌డికి తెర‌తీసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సినిమా విడుద‌ల‌కు వారం ముందు నుంచే ప్ర‌త్యేకంగా ప్రెస్ కు ప్రివ్యూలు వేసి.. విడుద‌ల టైమ్ కు పాజిటివ్ టాక్ ను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డం చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పెళ్లిచూపులుతో పాటు మెంట‌ల్ మ‌దిలో లాంటి చిన్న సినిమాల‌కు కూడా ఇది బాగానే హెల్ప్ అయింది.

ఇప్పుడు క‌ర్త‌వ్యంకు కూడా ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్. విడుద‌ల‌కు నాలుగు రోజుల ముందు నుంచే ప్ర‌త్యేకంగా షోస్ ప‌డుతున్నాయి. వాటికి అద్భుత‌మైన రెస్పాన్స్ కూడా వ‌స్తుంది. గ‌తేడాది త‌మిళ్ లో ఈమె న‌టించిన అర‌మ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇందులో న‌య‌న‌తార క‌లెక్ట‌ర్ గా న‌టించింది. రాజ‌కీయ నాయ‌కుల ఆట క‌ట్టించేలా ప‌వ‌ర్ ఫుల్ రోల్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో క‌ర్త‌వ్యం పేరుతో వ‌స్తుంది. 

మార్చ్ 16న ఈ చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఓ ఊరిలోని బోరుబావిలో ఓ చిన్న‌పాప ప‌డుతుంది. ఆమెను కాపాడే ప్ర‌య‌త్న‌మే సినిమా క‌థంతా. ఐఏఎస్ ఆఫీస‌ర్ నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చే మ‌హిళ‌గా ఇందులో న‌టించింది న‌య‌న‌తార‌. గోపీనైన‌ర్ ద‌ర్శ‌కుడు. తెలుగులో ఈ చిత్రానికి తెలిసి పెట్టారో.. లేదంటే కావాల‌నే పెట్టారో తెలియ‌దు కానీ క‌ర్త‌వ్యం అని పెట్టారు. ఒక‌ప్పుడు విజ‌య‌శాంతికి ఈ క్రేజ్ ఉండేది. ఇప్పుడు న‌య‌న‌తారకు అది వ‌చ్చింది. అందుకే ఈ చిత్రానికి ఇదే ప‌ర్ ఫెక్ట్ టైటిల్ అంటున్నాడు ద‌ర్శ‌కుడు గోపీ నైన‌ర్. క‌ర్త‌వ్యంకు పోటీగా కిరాక్ పార్టీ వ‌స్తుంది. మ‌రి దాన్ని దాటుకుని న‌య‌న ఎంత వ‌ర‌కు మాయ చేస్తుందో చూడాలి..! 
 

More Related Stories