English   

కార్తికి వారసుడొచ్చాడు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు.. 

Karthi and Ranjani
2020-10-21 08:05:29

తమిళ హీరో కార్తి గురించి తెలుగులో పరిచయం అవసరం లేదు. పేరుకు తమిళ హీరో అయినా తెలుగులోనే ఎక్కువ మార్కెట్ సంపాదించుకున్నాడు ఈయన. అన్న సూర్య తమ్ముడుగా వచ్చి తర్వాత ఆయన్నే మించిపోయాడు కూడా. గతేడాది కూడా ఈయన నటించిన ఖైదీ సంచలన విజయం సాధించింది. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలతో తెలుగులో కార్తి ఇమేజ్ భారీగానే పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన అభిమానులకు తీపికబురు చెప్పాడు. కార్తి మరోసారి తండ్రి అయ్యాడు. 2011లో రంజనీని పెళ్లి చేసుకున్న కార్తి.. 2013లో తొలిసారి తండ్రి హోదా అందుకున్నాడు. అప్పుడు వాళ్లకు ఓ అమ్మాయి పుట్టింది. ఏడేళ్ళ తర్వాత మరోసారి ఈయన తండ్రి అయ్యాడు. అక్టోబర్ 20న ఈయన కొడుకు పుట్టాడు. వారసుడు వచ్చిన విషయం ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు కార్తి. 

తమ కోసం అహర్నిషలు సేవ చేసిన హాస్పిటల్ సిబ్బందికి మనసారా కృతజ్ఞతలు తెలిపాడు కార్తి. అలాగే దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పాడు. తమ వారసుడికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరాడు ఈ హీరో. కెరీర్ విషయానికొస్తే గతేడాది ఖైదీ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న కార్తి.. ఆ తర్వాత దొంగ సినిమాతో వెనకబడ్డాడు. అయినా కూడా ఇప్పుడు వరస సినిమాలు చేస్తున్నాడు కార్తి. కెరీర్ పరంగా మంచి హైట్స్‌లో ఉన్నాడు ఈయన. ప్రస్తుతం ఈయన 'సుల్తాన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది. దాంతో పాటు లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో కూడా నటిస్తున్నాడు కార్తి. ఈ సినిమా షూటింగ్‌లో త్వరలోనే అడుగు పెట్టనున్నాడు కార్తి. అటు కెరీర్.. ఇటు వ్యక్తిగతంగా కార్తి ఇప్పుడు సంతోషంలో తేలిపోతున్నాడు. 

More Related Stories