English   

చినబాబు టీజర్ వచ్చేస్తోంది

Karthi Chinababu Teaser

తమిళ హీరోలంటే డబ్బింగ్ స్టార్సే అని ఖచ్చింగా ఫిక్స్ అయిన టైమ్ లో వచ్చిన కార్తీ అందుకు భిన్నంగా వెళ్లాడు. ఫస్ట్ మూవీ నుంచే తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటూ మనవాళ్లను విపరీతంగా ఆకట్టుకున్నాడు. కార్తీ అంటే తెలుగు హీరోల్లో ఒకడు అనిపించుకున్నాడు. వరుసగా విజయాలు కూడా చూశాడు. అయితే మధ్యలో కొన్ని ఫ్లాపులు. దీంతో వెనక్కి తగ్గి లాస్ట్ ఇయర్ ఖాకీగా వచ్చిన నిఖార్సైన హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు పల్లెటూరి కుర్రాడిగా ఓ రైతు పాత్రతో రాబోతున్నాడు. ఆ సినిమా పేరు చినబాబు. ఆల్రెడీ గతంలోనే ఈ టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ తో పాటు కార్తీ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తమిళంలో కడైకుట్టి సింగమ్ అనే టైటిల్ పెట్టారు. 

పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న చినబాబు టీజర్ రాబోతోంది. ఈ నెల 3న సాయంత్ర 7గంటలకు చినబాబు టీజర్ రాబోతోంది. ఇది తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల కాబోతోంది. మరి ఈ టీజర్ తో చినబాబు రేంజ్ ఎలా ఉంటందనేది ఓ అంచనాకు రావొచ్చేమో. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. 

More Related Stories