English   

శ్రీ రెడ్డిపై కార్తి ఫైర్...?

srireddy karthi
2018-07-19 21:57:16

గత కొన్నాళ్లుగా మీడియాలో సినిమా సెలబ్రిటీస్ పై విపరీతమైన ఆరోపణలు చేస్తూ హల్చల్ చేస్తోన్న నటి శ్రీ రెడ్డి. మొన్నటి వరకూ టాలీవుడ్ ఆర్టిస్టులను తిట్టిన తను లేటెస్ట్ గా కోలీవుడ్ పై పడింది. వరుసగా అక్కడి స్టార్స్ అందరిపైనా అలిగేషన్స్  చేస్తోంది. ఇందులో చాలా పెద్ద వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లంతా తనను వాడుకుని సినిమా అవకాశాలిస్తామని చెప్పి ఇవ్వలేదనేదే తన ప్రధాన ఆరోపణ. ఇందులో నడిగర్ సంఘం ప్రెసిడెంట్, స్టార్ హీరో విశాల్ కూడా ఉన్నాడు. ఈ విషయంపై విశాల్ కాస్త ఫైర్ అయ్యాడు. నడిగర్ సంఘం సమావేశం ఏర్పాటు చేసి శ్రీరెడ్డి పై చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేశాడు. దీంతో శ్రీ రెడ్డి అతనికి ‘సారీ’ చెప్పింది. కానీ తను ముందు నుంచీ చెబుతోన్న మురుగదాస్, శ్రీకాంత్, సుందర్ సి. లారెన్స్ ఇలా చాలామందిపై ఆరోపణలు చేసింది. అయితే తమిళ నటులు దీనిపై వ్యక్తిగతంగా స్సందించకుండా నడిగర్ సంఘం నుంచి రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘంలో కీలక సభ్యుడైన కార్తీ శ్రీ రెడ్డి ఇష్యూ పై సీరియస్ అయ్యాడు.

శ్రీ రెడ్డి ఆరోపణలపై నడిగర్ సంఘం నుంచి కార్తీ కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘‘ ఈ విషయంపై నడిగర్ సంఘం త్వరలో లీగల్ నోటీస్ లు ఇస్తుంది. ఇది నా వ్యక్తిగత విషయం కాదు. కానీ తన వద్ద ఆధారాలుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లొచ్చు. అంతే కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం కరెక్ట్ కాదు..  సోషల్ మీడియాలో తోచినట్టుగా మాట్లాడితే తనకు పేరొస్తుందేమో కానీ న్యాయంరాదు’’అని  చెప్పాడు. ఇదే టైమ్ లో మీడియాపైనా సెటైర్స్ వేశాడు. శ్రీ రెడ్డి లాంటి వ్యక్తి చెప్పే మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలా వద్దా.. అందులో నిజాలెన్ని అని ఆలోచించాల్సిన అవసరం మీడియాకు కూడా ఉందని చురకలంటించాడు.. మరి కార్తీ స్టేట్మెంట్ పై శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుందో.. 

More Related Stories