English   

ఖైదీ మేకర్స్ ప్లాన్...ఈసారి వాళ్ళని కూడా రోప్ చేసి..

Karthi Khaidi
2020-08-04 12:50:58

గత ఏడాది దీపావళికి పెద్దగా రచ్చ చేయకుండా రిలీజయ్యి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకున్న సొంతం చేసుకుంది ఖైదీ. విజయ్‌ బిగిల్‌ భారీ ప్రమోషన్స్ తో మంచి టాక్ వచ్చినా ఈ సినిమాకి అంత కన్నా పాజిటివ్‌ పబ్లిక్‌ టాక్‌ రావడంతో సినిమా ఎక్కడా తగ్గకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో అసలు ఎవరూ ఊహించని విధంగా ఒక ఖైదీ పోలీసులను రక్షించే కథతో ఈ సినిమాని తెరకెక్కించి హీరోయిన్, ఐటెం సాంగ్, పాటలు, లవ్‌ సీన్లు లేకపోయినా మంచి టాక్ సంపాదించింది. అప్పట్లోనే అందరూ ఊహించినట్టుగా ఈ సినిమాకి కొనసాగింపు ఉంటుందని ప్రకటించింది సినిమా యూనిట్. ఢిల్లీ (సినిమాలో కార్తి పాత్ర పేరు) మళ్లీ మీ ముందుకు వస్తాడు. ‘ఖైదీ- 2’ను తెరకెక్కిస్తామని’ ఆ సినిమా దర్శకుడు లోకేష్ కనగారాజ్ అప్పట్లో ప్రకటించాడు. 

ఇక ఖైదీకి సీక్వెల్ ఉంటుంద‌ని, త‌ప్ప‌కుండా త్వ‌ర‌లోనే ఆ సినిమా మొద‌ల‌వుతుంది కార్తీ చెప్పాడు. ‘ఖైదీ’ ఓ రాత్రి జ‌రిగిన క‌థ‌ కాగా ‘ఖైదీ 2’ మాత్రం అసలు ఢిల్లీ ఎందుకు జైలుకు వెళ్లాడు? జైలులో ఏం జ‌రిగింది? అనే విష‌యాన్ని పార్ట్ 2లో చూపిస్తారు. ఓ ర‌కంగా ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్. ఇక ఈ దర్శకుడు ప్రస్తుతం విజయ్‌ హీరోగా నటిస్తున్న 64వ సినిమా అయిన మాస్టర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అది పూర్తికాగానే లోకేష్ రజినీకాంత్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలానే ఈ ఖైదీ ప్రీక్వెల్. అయితే అందుతున్న సమాచారం మేరకు ఖైదీ 2 కోసం ఈ సారి తెలుగు యాక్టర్లను కొందరిని తీసుకోనున్నారని అంటున్నారు. 

ఎందుకంటే ఖైదీలో కార్తీ, విలన్ హరీష్ ఉత్తమన్ తప్ప మిగతా వారెవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన యాక్టర్ లేరు. ఈసారి కూడా తెలుగులో ఎలా అయినా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఓ యంగ్ హీరోనే కాక మరో తెలుగు వాళ్ళకి పరిచయం ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఖైదీ మొదటి భాగంలో హీరోకి భార్య ఉంటుందని చెప్పినా ఎక్కడ ఆమెను రివీల్ చేయరు. ఇప్పుడు ఈ సీజన్ లో ఆమెను రివీల్ చేస్తారట. 

More Related Stories