English   

వరదల్లో చిక్కుకున్న కార్తీ, రకుల్

Karthi Rakul Preeth Singh trapped in Floods
2018-09-24 21:40:34

ఖాకీ సినిమా తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఇన్సిడెంట్ తో కార్తీ, రకుల్ ప్రీత్ తో పాటు యూనిట్ మెంబర్స్ అంతా డేంజర్ జోన్ లో పడ్డారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాండే అనే టైటిల్ తో రాజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీ 17వ సినిమాగా రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం మనాలిలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం మనాలిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా ఎలాగోలా తమకు అనుగుణమైన ప్రాంతాల్లోనే షూటింగ్ చేస్తోందట యూనిట్. అయితే యూనిట్ అంతా షూటింగ్ లో బిజీగా ఉన్న టైమ్ లో సడెన్ గా వారున్న ప్రాంతానికి భారీ వరద చేరుకుందట.

క్షణక్షణానికి వరద తీవ్రత పెరిగిపోవడంతో వెంటనే తేరుకోలేకపోయిందట యూనిట్. కొందరు ఈ వరదలను వీడియో తీసి ‘వీయ్ ఆర్ ఇన్ డేంజర్ జోన్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కోలీవుడ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలేం జరుగిందని విపరీతంగా ఆరాలు మొదలయ్యాయి. ఇక షూటింగ్ జరుగుతోన్న ప్రాంతంలో కార్తీతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందట. అయితే వరద పెరుగుతున్న టైమ్ లోనే వీరంతా వీలైనంత వేగంగా షూటింగ్ స్పాట్ నుంచి సేఫ్ జోన్ లోకి వచ్చేశారని చెబుతున్నారు. కానీ వరద తాకిడికి షూటింగ్ కు సంబంధించిన కొన్ని సామాన్లు కొట్టుకుపోయాయట. సామాన్లు పోతే పోయాయి. కానీ అంతా సేఫ్ గా బయటకు చేరారని సమాచారం. ఏదేమైనా ప్రకృతి విపత్తులకు దూరంగా షూటింగ్స్ చేసుకోవడమే బెటర్.

More Related Stories