English   

స్టార్ డైరెక్టర్ ను గుంటనక్క అన్నాడు

Gautham-Menon
2018-04-04 17:31:20

కలిసి ఉన్నప్పుడు కంప్లైంట్స్ ఉండవు. కానీ విడిపోతేనే విపరీతమైన విమర్శలు వినిపిస్తాయి. నిన్నటి వరకూ కలిసున్న దర్శకుడిపై అతని అసోసియేట్ రీసెంట్ గా తీవ్ర విమర్శలు చేశాడు. ఇప్పుడు మరో నిర్మాత ఏకంగా అతన్ని గుంటనక్క అంటున్నాడు. ఈ ఇద్దరికీ ఇప్పుడు మరికొన్ని యంగ్ టోన్స్ జతకలుస్తున్నాయి. ఎన్నోయేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎంతోమంది అభిమానం సంపాదించిన ఆ దర్శకుడు వీరికి మాత్రమే గుంటనక్క ఎందుకయ్యాడు. అసలా దర్శకుడెవరు.. ? అంటే మోస్ట్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ మీనన్.. యస్ నిర్మాత గుంటనక్క అన్నది గౌతమ్ నే.

కొన్నాళ్ల క్రితం గౌతమ్ వద్ద అసోసియేట్ పనిచేసిన కార్తీక్ నరేన్ అనే దర్శకుడు విపరీతమైన కమెంట్స్ చేశాడు. గౌతమ్ ను ఇంచుమించు శాడిస్ట్ గా పోల్చాడతను. యంగ్ ఫిల్మ్ మేకర్స్ పాలిట గౌతమ్ ఓ విలన్ అనేశాడు. ఆ కుర్రాడి చేసే సినిమాకు నిర్మాతగా ఉంటానంటూ హ్యాండ్ ఇచ్చాడు గౌతమ్. దీంతో తనే స్వయంగా డబ్బు సమకూర్చుకుని ‘16’ అనే సినిమా చేశాడు నరేన్. ఈ సినిమా తెలుగులోనూ 16గా వచ్చి మంచి ప్రశంసలు అందుకుంది. ఆ దర్శకుడి తర్వాత ఇప్పుడు ఎల్రెడ్ కుమార్ అనే నిర్మాత గౌతమ్ పై భారీగా విరుచుకుపడ్డాడు.

ఎల్రెడ్ కుమార్ గతంలో విన్నితాండై వరువాయె(ఏమాయ చేశావె), నీతానే ఎన్ పొన్ వసంతం(ఎటోవెళ్లిపోయింది మనసు) చిత్రాలను నిర్మించాడు. అయితే తర్వాత మరో సినిమా చేస్తానని కుమార్ వద్ద గౌతమ్ డబ్బులు తీసుకున్నాడట. కానీ ఇన్నాళ్లైనా సినిమా చేయకపోగా, డబ్బులు కూడా రిటన్ ఇవ్వడం లేదు. దీంతో అతను కాస్త గట్టిగానే డబ్బులు అడిగాడు ఆ మధ్య. ఇది నచ్చని గౌతమ్ ఏకంగా కుమార్ పై కంప్లైంట్ చేస్తూ ఓ పేద్ద లెటరే రాశాడు. ఆ లెటర్ తో ఖంగు తిన్న కుమార్ ఇప్పుడు అతన్ని ఓ గుంటనక్క అంటూ ట్వీట్ చేశాడు. దీనికి అరవింద్ స్వామితో పాటు సంతాన కృష్ణన్ అనే మరో యంగ్ డైరెక్టర్ కూడా తోడై.. గౌతమ్ ను చీటర్ అంటున్నారు. మరి ఈ గొడవ ఎటు తేలుతుందో చూడాలి. 
 

More Related Stories