English   

సినిమాల్లోకి వంటలక్క ఎంట్రీ...క్యారెక్టర్ ఇదే

 Karthika Deepam
2020-10-28 10:06:28

తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ను బీట్ చేసేంత టిఆర్పీ రేటింగ్ వస్తుదంటే ఈ సీరియల్ రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. సీరియల్ లో ముఖ్యంగా దీప క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీప సీరియల్ లో నల్లగా ఉండటమే కార్తీక దీపం స్పెషల్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్ వచ్చినప్పటికీ కార్తీక దీపం సీరియల్ పై వచ్చినన్ని ట్రోల్స్ ఏ సీరియల్ పై రాలేదు. కాగా దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ ఆమె మలయాళ నటి. అయినప్పటికీ తెలుగులో ఆమెకు ఒక్క సీరియల్ తోనే ఫ్యాన్స్ పెరిగిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకు వంటలక్క అని పేరు పెట్టి ఎన్నో ట్రోల్స్ చేశారు. ఇక ఆ ట్రోల్స్ తోనే ఆమె పాపులారిటీని సంపాదించుకుంది. 

అయితే తాజాగా వంటలక్క ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తెలుగులో వస్తోన్న ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో తాను లీడ్ రోల్ చేస్తున్నట్టు పేర్కొంది. తాను నటి అవుతానని ఎప్పుడూ అనుకోలేదని  యాదృశ్చికంగా జరిగిపోయిందని తెలిపింది. ఇప్పుడు అభిమానులను చూస్తే తనకు ఆశ్చర్యంగా ఉందని వెల్లడించింది. కరోనా వచ్చి ఉండకపోతే ఇప్పటికే తాను నటించిన ఓ సినిమా విడుదల అయి ఉండేదని తెలిపింది. మొత్తానికి వంటలక్క సోషల్ మీడియా ఎఫెక్ట్ తో బుల్లి తెర నుండి వెండితెరకి వెళ్ళింది.

More Related Stories