English   

నాని హీరో అవ్వడానికి డాక్టర్ బాబే కారణమట

Nani
2021-05-13 17:12:06

ఇండ‌స్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మ‌రో హీరోకు రావ‌డం సాధార‌ణమే. కానీ ఓ సీరియ‌ల్ హీరోకు సినిమా ఆడిష‌న్ కోసం పిలుపు వ‌చ్చి అత‌డు వెళ్లేలోపే అసిస్టెంట్ డైరెక్ట‌ర్ తో సినిమా ఫిక్స్ చేశారట‌. దాంతో సీరియ‌ల్ హీరో అలాగే మిగిలిపోగా అసిస్టెంట్ డైరెక్ట్రర్ మాత్రం స్టార్ హీరోల రేంజ్ కు పెదిగిపోయాడు. అత‌డ‌వెరో కాదు హీరో నాని. ఇక సీరియ‌ల్ హీరోగా మిగిలిపోయింది కూడా ఎవ‌రో కాదు కార్తీక‌దీపం సీరియ‌ల్ లో హీరోగా డాక్ట‌ర్ బాబు గా న‌టించిన నిరూప‌మ్.  ఈ విష‌యాన్ని నిరూప‌మ్ ఓ ఇంట‌ర్యూలో వెల్లడించారు. 

నిరూప‌మ్ మొద‌ట సినిమాల్లో న‌టించాల‌నుకున్నార‌ట‌. అయితే అప్ప‌టికే సిరీయ‌ల్స్ లో న‌టిస్తున్న నిరూప‌మ్ కు అష్టా చెమ్మా సినిమా ఆడిష‌న్స్ కోసం పిలుపు వ‌చ్చింద‌ట‌. దాంతో ఆడిష‌న్స్ కు వెళ‌దామ‌ని సిద్ద‌మ‌వ‌గా అప్ప‌టికే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న నానిని హీరోగా తీసుకున్నార‌ట‌. స‌డ‌న్ గా ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ అలా జ‌రిగిపోయింద‌ని నిరూప‌మ్ అంటున్నారు. అలా ఛాన్స్ కొట్టేసిన నాని ఇప్పుడు ప‌దికోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోగా ఎదిగిపోయాడు. ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. అందుకే అంటారేమో సినిమాల్లో రాణించాలంటే అందం డ‌బ్బు కంటే టాలెంట్ మ‌రియు అదృష్టం ముఖ్య‌మ‌ని. ఇక ఇప్పుడు నిరూప‌మ్ సినిమా హీరో అవ్వ‌క పోయినా అత‌డు చేస్తున్న సీరియ‌ల్స్ తో డాక్టర్ బాబు గా తెలుగువాళ్లంద‌రికీ సుప‌రిచితుడ‌య్యాడు.  

More Related Stories