English   

త‌ల్లిని మించిపోయిన కార్తిక‌..

karthika nair

రాధ‌.. ఒక‌ప్పుడు తెలుగులోనే కాదు.. సౌత్ ఇండియాలోనే గ్లామ‌ర్ క్వీన్. ఎన‌భైల్లో ఈమె సోకుల‌కు ప‌డిపోని వాళ్లుండ‌రు. అంత‌గా మాయ చేసింది ఈ భామ‌. ఇక ఇప్పుడు ఆమె కూతుళ్ళు కూడా ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. చిన్న‌కూతురు తుల‌సి మ‌ణిర‌త్నం క‌డ‌లి సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. తొలి సినిమాతోనే ఫేడ‌వుట్ అయిపోగా.. పెద్ద కూతురు కార్తిక మాత్రం ఇప్ప‌టికీ త‌న‌దైన రోజు కోసం వేచి చూస్తూనే ఉంది. తెలుగులో జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌లేదు. ఇక త‌మిళ‌నాట కూడా కొన్ని సినిమాలు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. రంగం లాంటి విజ‌యం వ‌చ్చినా కూడా కార్తిక జాత‌కం మాత్రం మార‌లేదు. ఎలాగైనా ఇండ‌స్ట్రీలోనే నిల‌బ‌డాల‌ని ఇప్పుడు అందాలు ఆర‌బోస్తుంది ఈ బ్యూటీ. తాజాగా పిచ్చెక్కించే ఫోటోషూట్ ఒక‌టి చేసింది కార్తిక‌. అందులో దాచుకోకుండా గ్లామ‌ర్ షో చేసింది. ఈ మ‌ధ్యే సినిమాలు కాద‌ని.. ఆరంభ్ అనే హిందీ సీరియ‌ల్ లోనూ న‌టించింది కార్తిక‌. అందులో దేవ‌సేన‌గా మారింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు హాట్ ఫోటోషూట్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ దూకుడు చూసిన త‌ర్వాత త‌ల్లిని కూడా మించిపోయింది క‌దా ఈ భామ అనుకోక త‌ప్ప‌దు. రెడ్ డ్ర‌స్ లో ఏంజిల్లా క‌నిపిస్తుంది కార్తిక‌. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. కార్తిక‌కు ఇప్ప‌టికైనా మంచి రోజులు వ‌స్తాయో లేదో..?

More Related Stories