English   

కార్తికేయ కెరీర్ ను డైలమాలో పడేసిన గ్యాంగ్ లీడర్..

Karthikeya latest.jpg
2019-09-15 15:30:52

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమాలో అద్భుతమైన నటనతో తో క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ కుర్రహీరో. కానీ ఆర్ఎక్స్ 100 ఇచ్చిన కొనసాగించలేక ఆ తర్వాత చేసిన హిప్పీ, గుణ 369 సినిమాలు ఫ్లాపయ్యాయి. అలాంటి సమయంలో గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించాడు కార్తికేయ. ఇప్పుడు ఈ సినిమా విడుదలైంది. కార్తికేయ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. దాంతో తన పయనం ఎటు అని తేల్చుకోవడానికి సతమతమవుతున్నాడు కార్తికేయ.

గ్యాంగ్ లీడర్ సినిమాలో చూసి మిగిలిన దర్శక నిర్మాతలు కూడా ఫిదా అవుతున్నారు. ఆయన ఓకే అనాలే గానీ కార్తికేయకు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చేలా కనిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. దాంతో ఇకనుంచి ప్రతినాయకుడిగా సినిమాల్లో చేయాలా లేదంటే హీరోగా నటించాలా అనే కన్ఫ్యూజన్ కార్తికేయలో ఎక్కువగా కనిపిస్తోంది. తనకు మంచి సినిమాలు చేయాలని ఉందని చెబుతున్నాడు కార్తికేయ. అది హీరో విలన్ అని సంబంధం లేకుండా మంచి పాత్ర వస్తే ఖచ్చితంగా చేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పటికీ తాను ప్రతినాయకుడిగా నటించడానికి సిద్ధమేనని సిగ్నల్స్ ఇస్తున్నాడు కార్తికేయ. మరి దీన్ని మన దర్శక నిర్మాతలు ఎలా తీసుకుంటారో చూడాలి. ఈ కుర్రహీరోకు తగిన పాత్రలను సృష్టిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎవరు అవునన్నా కాదన్నా కచ్చితంగా గ్యాంగ్ లీడర్ సినిమా కార్తికేయ కెరీర్ కు ప్లస్ అయింది. నటుడిగా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు ఈ కుర్రహీరో. మరి దాన్ని ఎలా కంటిన్యూ చేస్తాడు అనేది చూడాలి.

More Related Stories