English   

క‌ర్త‌వ్యంకు ఈ టాక్ స‌రిపోతుందా..?

karthvyam-telugu- Movie
2018-03-17 09:57:16

స్టార్ హీరోల సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌స్తే బాక్సులు బ‌ద్ధ‌లైపోతాయి. కానీ చిన్న సినిమా హిట్ అవ్వాలంటే దానికి చాలా కార‌ణాలు క‌లిసిరావాలి ఒక్క పాజిటివ్ టాక్ మాత్ర‌మే వ‌స్తే స‌రిపోదు. క‌చ్చితంగా టాక్ మ‌రో స్థాయిలో ఉండాలి. ఇప్పుడు క‌ర్త‌వ్యంకు కూడా ఇదే జ‌రిగింది. ఈ చిత్రం చూసిన ప్ర‌తీ ప్రేక్ష‌కుడు కూడా సినిమా అద్భుతం అంటున్నాడు. ఎమోష‌న‌ల్ గా ఏడిపిస్తున్నారంటూ థియేట‌ర్స్ లోంచి కంట‌త‌డి పెట్టుకుంటూ వ‌స్తున్నారు. డ‌బ్బింగ్ సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు చేరువ కావ‌డానికి ఇంకా టైమ్ ప‌ట్టేలా ఉంది. న‌య‌న‌తార ఉన్నా కూడా క‌ర్త‌వ్యంకు ఊహించిన ఓపెనింగ్స్ అయితే రాలేదు. కానీ చూసిన వాళ్ల నుంచి టాక్ మాత్రం బ్ర‌హ్మాండంగా వెళ్లిపోయింది. ఈ చిత్రాన్ని త‌మిళ్ నుంచి 50 ల‌క్ష‌ల‌కు కొన్నారు శ‌ర‌త్ మ‌రార్. దానికితోడు ప్ర‌మోష‌న్ కోసం.. మిగిలిన అన్ని ఖ‌ర్చులు క‌లిపి 2 కోట్ల వ‌ర‌కు అయింది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ ఈజీగా కోటికి పైగా వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. మిగిలిన డ‌బ్బులు కూడా శాటిలైట్ రూపంలో వ‌చ్చేలా ఉన్నాయి. ఇవ‌న్నీ క‌లిపితే క‌ర్త‌వ్యం శ‌ర‌త్ మ‌రార్ కు మ‌రో డ‌బ్బింగ్ హిట్ తీసుకొచ్చిన‌ట్లే. గ‌తేడాది ఈయ‌న విడుద‌ల చేసిన అదిరింది మంచి విజ‌యం సాధించింది తెలుగులో. ఈ చిత్రంతోనే విజ‌య్ తెలుగులో తొలి విజ‌యం అందుకున్నాడు. ఇప్పుడు క‌ర్త‌వ్యం కూడా ఈ నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. మొత్తానికి ప‌వ‌న్ లాంటి ప‌వ‌ర్ స్టార్ చేయ‌లేని ప‌ని లేడీ సూప‌ర్ స్టార్ చేసింది. 

More Related Stories