English   

సాయిధరంతేజ్-క‌రుణాక‌ర‌ణ్.. ఒక‌రికి ఒక‌రు..!

sai-dharam-tej
2018-05-01 10:16:29

క‌రుణాక‌ర‌ణ్.. ఈ పేరు విన‌గానే తొలిప్రేమ సినిమా గుర్తొస్తుంది. ఒకే ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీలో టాప్ డైరెక్ట‌ర్ అయిపోయాడు క‌రుణాక‌ర‌ణ్. ఆ ఒక్క సినిమా పేరు చెప్పి 20 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. తొలిప్రేమ త‌ర్వాత ఈ 20 ఏళ్ళ‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ మాత్ర‌మే హిట్ట‌య్యాయి. మిగిలిన సినిమాల‌న్నీ ట్రెండ్ కు తట్టుకోలేక చేతులెత్తేసాయి. దాంతో క‌రుణాక‌ర‌ణ్ ను ప‌ట్టించుకోవ‌డం మానేసారు మ‌న హీరోలు. ఆ మ‌ధ్య నితిన్ న‌టించిన చిన్న‌దాన నీ కోసం కూడా ఫ్లాపైన త‌ర్వాత క‌రుణాక‌ర‌ణ్ డిమాండ్ బాగా ప‌డిపోయింది. ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా తొలిప్రేమ ద‌ర్శ‌కుడు అనే ముద్ర ఇప్ప‌టికీ క‌రుణాక‌ర‌ణ్ ను కాపాడుతుంది. అందుకే ఇప్ప‌టికీ హీరోలు ఈయ‌న్ని న‌మ్ముతున్నారు. ఇప్పుడు ఈయ‌న సాయిధ‌రం తేజ్ హీరోగా తేజ్ ఐ ల‌వ్ యూ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్. సీనియ‌ర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ఇమేజ్ కు త‌గ్గ‌ట్లే ఈ చిత్రం ఉంటుంద‌ని చెబుతున్నాడు క‌రుణాక‌ర‌ణ్. ఈ మ‌ధ్యే విడుదల అయిన ఫ‌స్ట్ లుక్ అయితే బాగానే ఉంది. పైగా తేజ్ కొత్త‌గా ఉన్నాడు. అయితే త‌మ సినిమా మాత్రం కొత్త‌గా ఉండ‌దు కానీ అందంగా ఉంటుంద‌ని చెబుతున్నాడు క‌రుణాక‌ర‌ణ్. మే 1న టీజ‌ర్ విడుద‌ల కానుంది. అస‌లే సాయి ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు.. క‌రుణాక‌ర‌ణ్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి ఈ ఇద్ద‌రూ క‌లిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలిక‌..!

More Related Stories