English   

స‌న్నీలియోన్ చ‌నిపోతే ఏం చేస్తారు..?

kasturi shankar and sunny leone

అదేంటి.. బ‌తికున్న స‌న్నీలియోన్ ను ఇప్పుడు ఎందుకు చంపేస్తున్నారు అనుకుంటున్నారా..? ఏం లేదు.. ఓ హీరోయిన్ కు వ‌చ్చిన డౌట్ ఇది. అది కూడా మీడియాపై. ఇప్పుడు శ్రీ‌దేవి చ‌నిపోయింది కాబ‌ట్టి ఆమె న‌టించిన సినిమాల్లోని పాట‌ల‌తో వారం రోజులుగా టీవీల‌న్నీ మోగుతున్నాయి. మొద‌టి రోజు చ‌నిపోయిందంట అయ్యోపాపం అన్నారు.. రెండోరోజు హార్ట్ ఎటాక్ కాదంట చంపేసారంట అన్నారు.. మూడోరోజు లేదు లేదు బాత్ ట‌బ్ లో కాలుజారి ప‌డి చ‌నిపోయిందంట అన్నారు.. లేదు బోనీక‌పూరే ఆస్తి కోసం చంపాడ‌ని మ‌రో రోజు అన్నారు. ఇలా శ్రీ‌దేవి చావుపై రోజుకో ర‌కంగా మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై చాలా మంది సెటైర్లు కూడా వేసారు. అస‌లు మీడియా ఇంత అతి చేయ‌డం అవ‌స‌ర‌మా అంటూ విమ‌ర్శ‌లు కూడా చేసారు. ఇలాంటి టైమ్ లో క‌న్న‌డన‌టి క‌స్తూరి ఓ సెటైర్ వేసింది ట్విట్ట‌ర్ లో. క‌స్తూరి అంటే అన్న‌మ‌య్య‌లో నాగార్జున‌కు మ‌ర‌ద‌లిగా న‌టించిన ముద్దుగుమ్మ‌. శ్రీ‌దేవి చ‌నిపోతే ఆమె పాట‌లు వేసారు.. మ‌రి స‌న్నీలియోన్ కానీ చ‌నిపోతే టీవీల్లో ఆమె న‌టించిన పోర్న్ వీడియోలు వేస్తారా అంటూ ట్విట్ట‌ర్ లో మీడియాపై సెటైర్ వేసింది. నిజ‌మే క‌దా.. కామెడీగా అనిపించినా ఇది నిజంగా ఆలోచించ‌ద‌గ్గ విష‌య‌మేనండోయ్..?

More Related Stories