English   

కాట‌మ‌రాయుడు ఎంత తెచ్చాడు.. ఎంత తేవాలి..?

2017-04-01 07:29:24

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు ప్ర‌యాణం బాక్సాఫీస్ దగ్గ‌ర అతి క‌ష్టంగా మారిపోయింది. తొలి వారం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిన కాట‌మ‌రాయుడు జ‌ర్నీకి రెండో వారం అస‌లైన చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. టాక్ తో ప‌ని లేకుండా ఈ సినిమా తొలి వారంలోనే ఏకంగా 55 కోట్ల షేర్ వ‌సూలు చేసి ర‌ప్ఫాడించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో ఇదో రికార్డ్. కానీ తొలి వారం త‌ర్వాత కాట‌మ‌రాయుడు చాలా థియేట‌ర్స్ లో నుంచి తీసేసారు. ఈ వారం గురుతో పాటు మ‌రో రెండు సినిమాలు విడుద‌ల కావ‌డం.. అందులో గురుకు పాజిటివ్ టాక్ రావ‌డంతో రాయుడు జ‌ర్నీకి బ్రేకులు ప‌డ్డాయి. 55 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. పెద్ద పెద్ద హిట్ సినిమాల‌కే సాధ్యం కాని రికార్డ్ ఇది. అయితే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే తీసుకురావాల్సింది 80 కోట్ల‌పైనే. కానీ ఇప్ప‌టికే కాట‌మ‌రాయుడు ప్రయాణం చివ‌రికి వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు లేచి నిల‌బ‌డుతుంద‌నే న‌మ్మ‌కం కూడా లేవు. చూడాలి మ‌రి.. ప‌వ‌న్ బ‌య్య‌ర్ల‌ను ఎంత మేర ముంచేస్తాడు.. ఎంత వ‌ర‌కు తేలుస్తాడు..?

More Related Stories