English   

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ సరసన మరో ఫారిన్ భామ...ఎవరంటే ?

ntr
2019-11-20 05:14:18

బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి చాలా రోజులయ్యింది. ఇప్పటి వరకు దాదాపుగా 70 శాతం వరకు షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి రకరకాల ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఇక ప్రమోషన్స్ విషయానికి బస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన ఓ లుక్ రిలీజ్ చేశారు. అది కూడా సగం సగం మొహాలతో ఉన్న ఫోటో.  ఆ తరువాత సినిమా నుంచి అఫీషియల్ గా ఎలాంటి లుక్ రిలీజ్ చేయలేదు. దసరాకు ఏదైనా లుక్ వస్తుంది అనుకుంటే అది లేదు. అయితే ఈరోజు సడన్ గా టీమ్ నుండి ఒక సంచలన ప్రకటన వచ్చింది. అదేంటంటే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్నీ రేపు రెవీల్ చేయబోతున్నట్టు యూనిట్ పేర్కొన్నది. 

గతంలో ఇద్దరు విదేశీ హీరోయిన్లను తీసుకున్నా కొన్ని కారణాల వలన సినిమా ఇద్దరూ సినిమా నుండి తప్పుకున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మళ్లీ మరో ఫారిన్ హీరోయిన్ నీ ఎంపిక చేశారు. ఆమె పేరు క్యాథరిన్ ల్యాంగ్ ఫోర్డ్ అని సమాచారం. ఇక ఇన్సైడ్  సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ ఎవరు పోషిస్తున్నారు అనేది కూడా రేపే రివీల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కీలక రోల్స్ కోసం తమిళ దర్శకుడు సముద్ర ఖని అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ను తీసుకున్నార. మరి ఆ విలన్ రోల్ వారిలో ఎవరైనా పోషిస్తున్నారా లేక మరో స్టార్ నీ ఎవరినైనా ఈ సినిమాలో భాగం చేశారా అనేది రేపు తేలిపోనుంది.

More Related Stories