English   

 క‌త్తి పెట్టినా కూడా త‌గ్గ‌ట్లేదుగా.. 

Kathi-Mahesh

క‌త్తిమ‌హేశ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వివాదాలెక్క‌డ ఉంటే ఈయ‌న కూడా అక్క‌డే ఉంటాడు. కావాల‌ని వెళ్లి మ‌రీ కాంట్ర‌వ‌ర్సీల‌ను నిద్ర లేపుతూ తాను మేల్కొంటాడు క‌త్తి మ‌హేశ్. ఒక‌ప్పుడు కేవ‌లం మీడియా స‌ర్కిల్స్ లో మాత్ర‌మే తెలిసిన ఈ పేరు బిగ్ బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ పుణ్య‌మా అని అంద‌రి నోళ్లలో నానింది. ఇక ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేసి సెలెబ్రెటీ అయ్యాడు క‌త్తి. ఆ త‌ర్వాత కూడా నోటికొచ్చిన‌ట్లు వాగేసి అంద‌ర్నీ తిట్టేసి ఏదేదో చేసాడు. మ‌నుషుల్ని తిడితేనే మ‌నోభావాలు దెబ్బ‌తింటాయి. అలాంటిది ఏకంగా దేవున్నే టార్గెట్ చేస్తే ఊరుకుంటారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది. నీ పాపం పండెను నేడు అన్న‌ట్లు శ్రీ‌రాముడిపై చేసిన వ్యాఖ్య‌లకు పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే స్టేష‌న్ లో ఉండి కూడా క‌త్తి మ‌హేశ్ నోరుకు అదుపు లేకుండా పోతుంది. తాను అన్న‌దాంట్లో త‌ప్పేం లేదంటున్నాడు. శ్రీ‌రామున్ని ఇప్ప‌టికీ అదే స్థాయిలో వ్యాఖ్య‌లు చేస్తున్నాడు క‌త్తి. దీనిపై ప‌లు సంఘాలు చాలా సీరియ‌స్ అవుతున్నాయి. కోట్లాది మంది కొలిచే దేవున్ని అలా కించ‌ప‌రిచేలా మాట్లాడ‌టం మాత్రం నిజంగా దారుణం అంటున్నారు. ఇదిలాగే కంటిన్యూ అయితే క‌త్తికి ఇంకా తిప్ప‌లు త‌ప్ప‌వు. ఇప్ప‌టికైనా ప‌ద్ద‌తులు మార్చుకుంటే.. లెజెండ్ లో బాల‌య్య చెప్పిన‌ట్లు ప‌దిమందిలో ప్లేస్ ఉంటుంది.. ప‌దేళ్ల ఆయుష్షు ఉంటుంది. అలా కాద‌ని కాల‌ర్ ఎగ‌రేస్తే క‌చ్చితంగా తోక‌లు కట్ చేస్తామంటున్నారు క‌త్తి ఫ్యాన్స్. 

More Related Stories