స్టార్ హీరోయిన్ కత్రినాకి కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో మరీ ముఖ్యంగా ముంబై మహానగరంలో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో బాలీవుడ్ లో వరుసగా స్టార్స్ కోవిడ్ బారిన పడుతున్నారు. ఇటీవల అక్షయ్‌కుమార్‌తో పాటు ఆయనతో కలిసి పనిచేసిన యూనిట్ సిబ్బంది దాదాపు 30 మందికి కూడా కరోనా సోకింది.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. జాగ్రత్తలు పాటించండి' అని కత్రినా పేర్కొన్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ట్వీట్ చేశారు.