English   

ప్రియాంక పెళ్లి చేస్తోన్న స‌ల్మాన్.. 

salman khan
2018-07-28 12:50:42

ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇండియ‌న్ హీరోయిన్ కాదు.. ఆమెకు మూడేళ్ల కిందే ఇండియ‌న్ సినిమాతో సంబంధాలు తెగిపోయాయి. ఇక్క‌డ సినిమాలు కూడా ఒప్పుకోవ‌డం లేదు. ఏదో కార‌ణంతో భ‌ర‌త్ సినిమాలో స‌ల్మాన్ తో న‌టించ‌డానికి సై అన్న‌ది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి కూడా త‌ప్పుకుంది. కార‌ణం కూడా చాలా ప్ర‌త్యేక‌మైందే. కొన్ని రోజులుగా హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ తో ప్రేమ‌లో ఉంది ఈ భామ‌. అయితే ఇన్నాళ్ళూ ఈ ప్రేమ‌పై ఎన్ని వార్త‌లు వ‌చ్చినా కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోని ప్రియాంక‌.. ఇప్పుడు జీవితంపై ఓ నిర్ణ‌యం తీసుకుంటుంది. త్వ‌ర‌లోనే నిక్ ను పెళ్లి చేసుకోను న్న‌ట్లు ప్ర‌క‌టించింది కూడా. 

ఈ విష‌యాన్ని భ‌ర‌త్ ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫర్ బ‌య‌ట పెట్టాడు. ప్రియాంక త‌మ సినిమాలో చేయ‌డం లేద‌ని.. దీనికి ప్ర‌త్యేక కార‌ణం కూడా తెలిపింద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆమె జీవితంలో తీసుకుంటున్న కీల‌క‌మైన నిర్ణ‌యానికి.. ప్రేమ‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు అలీ. ప్రియాంక త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు ఈ స్థానంలోకి క‌త్రినాకైఫ్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే స‌ల్మాన్, క‌త్రినా సూప‌ర్ హిట్ జోడీ. పైగా అలీ అబ్బాస్ తెర‌కెక్కించిన టైగ‌ర్ జిందా హైలో కూడా ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. దాంతో ఈ జోడీనే మ‌ళ్లీ రిపీట్ చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు. మొత్తానికి భ‌ర‌త్ పుణ్య‌మా ప్రియాంక చోప్రా పెళ్లి విష‌యం ఓపెన్ అయిపోయిందిప్పుడు.


 

More Related Stories