English   

కట్టప్ప లండన్ లో సెటిల్ అవుతున్నాడా..? 

Kattappa-Madame
2018-03-13 14:13:09

బాహుబలి సినిమాలో ప్రభాస్ కు ఎంత పేరొచ్చిందో అంతకంటే ఎక్కువగానే కట్టప్ప పాత్రకు వచ్చింది. తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర వాల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఒక రకంగా కామన్ మ్యాన్ నుంచి దేశ ప్రధాని వరకూ కట్టప్ప పేరు తలచుకోకుండా లేరు. ఆ స్థాయిలో ప్రభావం చూపిన పాత్ర అది. అందుకే ఇప్పుడా పాత్రను పర్మనెంట్ గా లండన్ లో సెటిల్ చేయబోతున్నారు. అంటే సత్యరాజ్ లండన్ లో సెటిల్ అవుతున్నాడని కాదు.. అతని పాత్ర కట్టప్పను లండన్ టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు మ్యూజియం నుంచి కట్టప్పకు.. సారీ సత్యరాజ్ కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. 

నిజానికి బాహుబలి పాత్రధారి ప్రభాస్ విగ్రహాన్ని కూడా టుస్సాడ్ మ్యూజియంలో పెట్టారు. కానీ లండన్ నుంచి వాళ్లు బ్యాంకాక్ లో ఓ బ్రాంచ్ తెరిచారు. అక్కడ ఫస్ట్ స్టాచ్యూగా ప్రభాస్ బాహుబలి విగ్రహాన్ని పెట్టారు. కానీ కట్టప్పది మాత్రం మెయిన్ బ్రాంచ్ లోనే ఏర్పాటు చేయడం విశేషం. ఏదేమైనా లండన్ టుస్సాడ్ మ్యూజియంలో చోటు సంపాదించుకున్న తొలి తమిళ నటుడు సత్యరాజ్ కావడం మరీ విశేషం. 

More Related Stories