English   

కరోనాతో సీనియ‌ర్ న‌టి కుమారుడు మృతి 

Kavitha
2021-06-17 17:07:26

సీనియ‌ర్ న‌టి క‌విత ఇంట్లో మ‌హ‌మ్మారి తీవ్ర విషాదం నింపింది. క‌రోనా బారిన ప‌డ్డ క‌విత కుమారుడు సంజ‌య్ రూప్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచాడు. క‌విత భ‌ర్త ద‌శ‌ర‌థ రాజ్ కూడా ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో వైద్యం తీసుకుంటున్నాడు. ఆయ‌న ప‌రిస్థితి కూడా ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

సంజయ్ రూప్ మృతి  విషయానికొస్తే.. కరోనా సోకిన సంజయ్ తొలుత ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే రోజుకురోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండటం గమనించిన కవిత కుటుంబసభ్యులు ఆయన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొడుకుని బతికించుకునేందుకు కవిత శతవిధాల ప్రయత్నించినప్పటికీ.. ఆమె ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 

More Related Stories