English   

తెలంగాణ ముఖ్యమంత్రి KCRతో బాలకృష్ణ భేటీ కాబోతున్నాడా..

Balakrishna
2020-06-05 13:17:21

కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇన్ని రోజులు మేమంతా ఒక్కటే.. ఒకే తల్లి బిడ్డలం.. ఆ కళామతల్లి అందరికీ సమానమే అంటూ గొప్పలకు పోయిన వాళ్ళు ఇప్పుడు తమ మధ్య విభేదాలు బయటపెట్టుకున్నారు అంటూ చాలామంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీటింగ్ జరిగిన తర్వాత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను మాత్రమే చర్చించినట్లు అయితే తను పిలవకుండా ఎందుకున్నారు అంటూ ఆయన ప్రశ్నించాడు. అన్ని మీటింగ్స్ జరిగినా తనను ఒక్కరు కూడా పిలవలేదని ఆగ్రహంతో ఊగిపోయాడు బాలకృష్ణ. అందుకే అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ విషయం జరిగిన తర్వాత అటు బాలకృష్ణ ఇటు చిరంజీవి వర్గం రెండుగా చీలిపోయాయి. ఎవరికి తోచిన వాళ్ళు వాళ్లకు నచ్చిన వాళ్లను సపోర్ట్ చేస్తున్నారు.

మరోవైపు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. బాలయ్య అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా కొందరు దర్శక నిర్మాతలు నాగబాబును విమర్శించారు. ఇదంతా ప్రభుత్వం కూడా మౌనంగానే గమనిస్తుంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులపై తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అడిగి అన్ని విషయాలు ఆరా తీస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని గొంతెత్తి చెప్పే వీళ్లు ఇలా ఒకరినొకరు విమర్శించుకోవడం ఉన్నారు ఏంటి అని కెసిఆర్ కూడా షాక్ అయ్యాడని తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే బాలకృష్ణ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

అసలు ఏం జరుగుతుంది అనే విషయంపై అక్కడ చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ తనను దూరం పెట్టాడని వస్తున్న వార్తలు పచ్చి అబద్ధం అంటూ బాలకృష్ణ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తేల్చేశాడు. తానంటే కెసిఆర్ కు చాలా ఇష్టమని.. అన్న గారి కొడుకుగా తనపై ఆయన పుత్రవాత్సల్యం చూపిస్తాడని చెప్పాడు బాలయ్య. ఇలాంటి సమయంలో బాలకృష్ణ కేసీఆర్ భేటీ జరిగితే అది నిజంగానే మరో సంచలనం అవుతుంది. చూడాలిక ఏం జరగబోతుందో. నిజంగానే ఇద్దరు కలిస్తే మాత్రం మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. 

More Related Stories