బ్యాడ్ టైమ్ అంటే ఇదే కీర్తి..!

కీర్తిసురేష్.. సరిగ్గా ఏడాది కింద ఈ పేరు విని మిగిలిన హీరోయిన్లు కూడా బాగానే కుళ్లుకున్నారు. కానీ ఏడాది తిరిగేసరికి సీన్ అంతా మారింది. మొన్న సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చాయి. రెండూ పెద్ద సినిమాలే.. వాటితో రెండు ఇండస్ట్రీల్లోనూ సెటిలైపోవచ్చు అని చాలా కలలే కంది కీర్తిసురేస్. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ కల్లలయ్యాయి. టాలెంటెడ్ హీరోయిన్.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుంది అనే ఇమేజ్ కీర్తికి ఉండేది. కానీ ఇప్పుడు గ్యాంగ్.. అజ్ఞాతవాసి తర్వాత అది మారిపోయింది. ఈమె కూడా మామూలు హీరోయిన్ అని తేలిపోయింది. 2018 తన కెరీర్ ను మార్చేస్తుందని ఎన్నో ఊహలతో ఉన్న కీర్తికి వరసగా రెండు భారీ షాకులు తగిలాయి. ఏడాది మొదట్లోనే సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఈమె కెరీర్ కు పెద్దగా హెల్ప్ కాలేదు. అజ్ఞాతవాసి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనిలేదు.. ఇక సూర్య గ్యాంగ్ సైతం పోయింది. ఈ రెండు సినిమాల్లో కీర్తిసురేష్ కారెక్టర్ బలంగా ఉందంటే అదీ లేదు. రెండు సినిమాల్లోనూ ఆటలో అరటి పండులా మారిపోయింది. హీరోయిన్ అంటే ఏదో రెండు పాటలు.. రెండు సీన్స్ అన్నట్లుగా ఉంది ఈ సినిమాల్లో కీర్తిసురేష్ పాత్ర. మధ్యలో పాట కోసమే వచ్చింది ఈ బ్యూటీ. దాంతో రెండు సినిమాలు కీర్తిసురేష్ కెరీర్ కు పెద్దగా గుర్తింపు తీసుకొచ్చిందేమీ లేదు.. ఉన్న ఇమేజ్ తీసేయడం తప్ప. ఇప్పుడు ఈమె ఆశలన్నీ మహానటి సినిమాపైనే ఉన్నాయి. ఇందులో సావిత్రి పాత్రలో నటిస్తుంది కీర్తి. ఇదే ఆమె కెరీర్ ను కాపాడాలిక..!