English   

సాయిపల్లవి రూట్ లో కీర్తి సురేష్

kreethisuresh
2018-02-21 20:15:40

కాస్త ఫేమ్ రాగానే ఫ్రేమ్ లోకి రావడానికి హీరోయిన్లు పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు.. ఇది ఈ మధ్య బాగా వినిపిస్తోన్న మాట. లేటెస్ట్ గా ఒక్క హిట్ కే సాయి పల్లవి దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందనే మాటలు రెగ్యులర్ గా వింటున్నాం. ఫిదా తర్వాత ఈ భామ చేసిన ఎమ్.సి.ఏ కోసం ఏకంగా నానితోనే గొడవపడిందనే రూమర్సూ వచ్చాయి. తర్వాత కణం సినిమా విషయంలో కూడా నాగశౌర్యతో కాస్త తలపొగరుగా ప్రవర్తించిందని అతనే చెప్పుకుంటున్నాడు. ఇక్కడే కాదు.. అమ్మడు కోలీవుడ్ లో కూడా సూర్యతో చేస్తోన్న సినిమాతోనూ ఇలాగే ఇబ్బందులు పెడుతోందట. సెల్వరాఘవన్, సూర్య వంటి స్టార్స్ ను కూడా సాయి పల్లవి విపరీతంగా ఇబ్బంది పెడుతోందనే వార్తలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కీర్తి సురేష్ పై కూడా ఇలాంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.

మొదట్లో బానే ఉన్న కీర్తి సురేష్.. ఇప్పుడు వరుసగా సౌత్ లోని స్టార్ హీరోలందరి సరసనా ఆఫర్స్ అందుకుంటోంది. ఇంకేముందీ..  రేంజ్ మారేసరికి దర్శక నిర్మాతలను ఓ రేంజ్ లో ఆడుకుంటోందట. షాట్ రెడీ అయిన తర్వాత కూడా గంటలు గంటలు మేకప్ రూమ్ లోనే ఉండిపోతోందట. చిన్న షాట్ కు కూడా విపిరీతమైన మేకప్ వేసుకుంటూ.. నానా కాలయాపన చేస్తోంది కీర్తి సురేష్ అని కోలీవుడ్ లో న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. రావడానికి లొకేషన్ కు చాలా ఎర్లీగానే వచ్చినా.. ఈ అతిమేకప్ తో మూణ్నాలుగు గంటల పాటు క్యారవాన్ లోనే గడిపేస్తోందట. దీంతో ఇతర ఆర్టిస్టుల కాల్షీట్స్ వేస్ట్ అవుతున్నాయని ఆయా చిత్ర నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఏదేమైనా కెరీర్ ఆరంభంలోనే ఇలా ఇబ్బందులు పెట్టేస్తే కెరీర్ కే డ్యామేజ్ అవుతుంది. అది మర్చిపోయి వచ్చిన స్టార్డమ్ ను నెత్తికి ఎక్కించుకుని ప్రవర్తిస్తే ఫైనల్ గా వీరిని పక్కన బెట్టడానికి మరీ ఎక్కువ సినిమాలేం తీసుకోరు మన మేకర్స్ ..

More Related Stories