English   

మ‌హాన‌టికి మ‌రో మ‌హా ఆఫ‌ర్ 

keerthy-rajamouli

కీర్తి సురేష్‌.. ఇప్పుడీ పేరు ఒక్క‌టే కాదు.. అలియాస్ మ‌హాన‌టి కూడా అనాల్సి వ‌స్తోంది. ఆస్థాయిలో మ‌హాన‌టితో అభిమానుల్ని సంపాదించుకుందీ కేర‌ళ కుట్టి. ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన సినిమాలు తీసుకురాని ఇమేజ్ ను మ‌హాన‌టి తెచ్చింది. అలాగే త‌న‌కూ మ‌హాన‌టి స్థాయి న‌టి అన్న పేరూ వ‌చ్చింది. ప్రేక్ష‌కుల నుంచి ప‌రిశ్ర‌మ వ‌ర‌కూ మ‌హాన‌టిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తూనే ఉంది. ఇక కీర్తి సురేష్ నైతే ఆకాశానికెత్తుతున్నారు. ఇదే సందు అనుకుని త‌ను జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో కూడా న‌టిస్తోంద‌నే రూమ‌ర్స్ కూడా వ‌చ్చాయి. కానీ అవి నిజం కాద‌ని తేల్చేసిందీ మ‌హాన‌టి. అయితే లేటెస్ట్ గా అమ్మ‌డికి మ‌రో మెగా ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. 

మ‌హాన‌టి విడుద‌ల‌కు ముందు వ‌ర‌కూ త‌న‌కు ఆ సినిమాపై ఎలాంటి ఆస‌క్తీ లేదు అని చెప్పాడు రాజ‌మౌళి. కానీ చూసిన త‌ర్వాత ఎంటైర్ టీమ్ కు స్పెల్ బౌండ్ అయిపోయాడు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్ర‌తిభ‌నూ తెగ మెచ్చుకున్నాడు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌మౌళి సినిమాల్లో హీరోయిన్ల పాత్ర బ‌లంగా ఉన్న‌ది ఈగ‌, బాహుబ‌లిలో మాత్ర‌మే. మిగ‌తా అన్నీ సినిమాల్లోనూ అత‌ని హీరోయిన్ల‌ది రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ క్యార‌క్ట‌ర్సే. కానీ మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ కు త‌న సినిమాలో ఆఫ‌ర్ ఇవ్వ‌బోతున్నాడు రాజ‌మౌళి అనే వార్త టాలీవుడ్ లో హ‌ల్చ‌ల్ చేస్తోంది.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి .. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ట రాజ‌మౌళి.  అయితే జ‌య‌ల‌లిత బ‌యోపిక్ కు సంబంధించి స్పందించిన కీర్తి.. త‌ను ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్టేం చేయ‌డం లేద‌ని తేల్చేసింది. అలాగే మ‌హాన‌టి కంటే ముందే ఒప్పుకున్న మూడు పెద్ద హీరోల సినిమాల్లో ఇప్పుడు న‌టిస్తున్నాన‌ని కూడా చెప్పింది. ఆ మూడూ పూర్త‌వ‌డానికి మ‌రో ఆరు నెల‌లైనా ప‌డుతుంది. అటు రాజ‌మౌళి ప్రాజెక్ట్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో.. ఒక‌వేళ రాజ‌మౌళి సినిమాలో కీర్తి సురేష్ ఓ హీరోయిన్ గా చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.. ఏదేమైనా మ‌హాన‌టితో కీర్తి సురేష్ రేంజే మారిపోయింది.

More Related Stories