English   

రానాకి నో చెప్పిన కీర్తి సురేష్

Keerthi_Suresh.jpg
2019-09-18 07:00:25

నేను శైలెజా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన ఆమె  ఆ సినిమాతో రికార్డులను కొల్లగొట్టి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డ్ కూడా అందుకుంది. మహానటితో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతుందని భావించినా అది అంచనాలకే పరిమితం అయ్యింది. ఒక్క క్రేజీ ప్రాజెక్ట్‌ కూడా లేకపోవడంతో కీర్తి అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. అయితే తాజాగా దగ్గుబాటి రానా కొరియన్‌ చిత్రానికి సంబంధించిన హక్కులను సొంతం చేసుకున్నాడు. 

మాఫియా బ్యాక్‌ గ్రౌండ్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. నందని రెడ్డి తెరకెక్కించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి బావుంటుందని భావించిన చిత్ర యూనిట్‌ సంప్రదిస్తే కీర్తి నో చెప్పినట్లుగా సమాచారం. ఆమె కాల్షీట్లు లేవని నో చెప్పిందని అంటుండగా కీర్తికి ఆ పాత్ర నచ్చకనే నో చెప్పిందని మరో వర్గం అంటోంది. ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రకి కీర్తి సురేష్ ని అడిగారట. ఆమె కాదడంతో మరో నటి కోసం వెతుకులాట మొదలుపెట్టారని అంటున్నారు.

More Related Stories