English   

ఈ హీరోయిన్లిద్దరూ చితగ్గొడుతున్నారుగా..?

keerthy-samantha

సినిమా తీసి చూడు ప్రమోషన్ చేసి చూడు అంటున్నారిప్పుడు. ప్రమోషన్ లేకపోతే ప్రాబ్లమ్స్ తప్పవు. ఈ విషయం అతి తక్కువ టైమ్ లో తెలుసుకున్నారు కాబట్టే.. మీడియాతో గొడవ ప్రాబ్లమ్ అని గ్రహించింది ఇండస్ట్రీ. ఈ కారణంగానే చాలా త్వరగానే కాంప్రమైజ్ అయింది. అఫ్ కోర్స్ ఇటు మీడియా కూడా సినిమా లేకపోతే చాలా ‘లాస్’ అవుతుందనుకోండి. ఆ విషయం పక్కన బెడితే ఇప్పుడు మహానటి కోసం హీరోయిన్లిద్దరూ తెగ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే టైటిల్ పాత్రలో నటిస్తోన్న కీర్తి సురేష్ గత శనివారం అర్థరాత్రి వరకూ ఆగకుండా ఇంటర్వ్యూస్ ఇచ్చింది. మళ్లీ ఆదివారం కూడా మరికొన్ని చానల్స్, పత్రికలకు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ప్రతి ఇంటర్వ్యూలోనూ మొహంపై చిరునవ్వు చెరగనీయడం లేదీ బ్యూటీ.  అయితే సండే నుంచి కీర్తి సురేష్ కు సమంత తోడైంది. ఇద్దరూ కలిసి కొన్ని చానల్స్ కు, విడివిడిగా కొన్ని చానల్స్ కు ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజిబిజీగా గడిపేశారు. ఒక రకగా ఈ సినిమాలో సమంతది కీలక పాత్ర కాదు. అయినా ఓ మంచి సినిమా కోసం తన వంతుగా ప్రమోషన్స్ చేస్తూ చాలామంది హీరోయిన్లకు కనువిప్పు కలిగిస్తోంది. ఇక సమంత ఏసినిమా ప్రమోషన్స్ లో అయినా చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. తను హీరోయిన్ కాకపోయినా ఆ యాక్టివ్ నెస్ ఎక్కడా తగ్గించడం లేదు. ఏదేమైనా చాలామంది స్టార్స్ ఉన్నా.. సినిమా ప్రమోషన్స్ ను తమ భుజాలపై వేసుకున్నారీ భామలిద్దరూ. మరి వీరి కష్టం ఫలించి మహానటి మెగా హిట్ కావాలని కోరుకుందాం..

More Related Stories