English   

కీర్తి.. తెలుగులో కీర్తి అవ‌స‌రం లేదా..?

keerthy suresh

కీర్తిసురేష్.. తెలుగులో ఇప్పుడు ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. దానికి కార‌ణం మ‌హాన‌టి. ఈ చిత్రంతో నిజంగానే మ‌హాన‌టి అయిపోయింది కీర్తిసురేష్. ఈ భామ‌తో సినిమాలు చేయ‌డానికి ఇప్పుడు ఉత్సాహ‌ప‌డుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ తెలుగులో న‌టించ‌డానికి కీర్తి మాత్రం ఉత్సాహంగా క‌నిపించ‌డం లేదు. అవును.. అజ్ఞాత‌వాసి దెబ్బ‌తో తెలుగులో స్టార్ హీరోల సినిమాలు ఒప్పుకోవాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకుంటుంది ఈ భామ‌. దానికి కార‌ణం క‌థ లేకుండా కేవ‌లం స్టార్ ఇమేజ్ తోనే సినిమాలు తీస్తార‌ని. హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌లు తెలుగులో రావ‌ని ఫీల్ అవుతుంది కీర్తి. అందుకే మ‌హాన‌టి త‌ర్వాత వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నా కూడా దేనికి ఇప్ప‌టి వ‌ర‌కు ఓకే చెప్ప‌లేదు కీర్తి. త‌మిళ్లో మాత్రం విక్ర‌మ్.. విజ‌య్.. విశాల్ స‌ర‌స‌న న‌టిస్తూ బిజీగా ఉంది. సామి స్క్వేర్.. విజ‌య్ 62.. పందెంకోడి 2 సినిమాల్లో కీర్తినే హీరోయిన్. తెలుగులో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాతి సినిమాలో కీర్తినే హీరోయిన్ గా తీసుకుంటున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి కానీ దీనిపై కూడా క్లారిటీ ఇవ్వ‌లేదు ఈ బ్యూటీ. మొత్తానికి మ‌హాన‌టి స‌క్సెస్ ఎంజాయ్ చేస్తూనే త‌న‌దైన పాత్ర కోసం చూస్తుంది ఈ మోడ్ర‌న్ మ‌హాన‌టి. చూడాలిక‌.. కీర్తిని ఒప్పించే పాత్ర మ‌నోళ్లు ఎప్ప‌టికి రాస్తారో..? 

More Related Stories