English   

మ‌ళ్లీ సావిత్రమ్మ‌గా కీర్తిసురేష్..

Keerthy-Suresh

అభిన‌వ సావిత్రిగా కీర్తిసురేష్ న‌ట‌న‌కు అంతా ఫిదా అయిపోయారు. నిజంగానే సావిత్రి ఆత్మ కీర్తిలో ఉందేమో అనేంత‌గా ఆమెను త‌న‌లో చేర్చుకుంది కీర్తి. మ‌హాన‌టి కేవ‌లం కీర్తిసురేష్ న‌ట‌న వ‌ల్లే అంత పెద్ద విజ‌యం సాధించిందంటే అతిశ‌యోక్తి కాదు. భావి త‌రాల‌కు సావిత్రి ఎవ‌రు అంటే మ‌రోమాటే  లేకుండా కీర్తి పేరు గుర్తొస్తుంది. అంత‌గా ఆ పాత్ర‌లో ఒదిగిపోయి ప్ర‌శంస‌లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇక ఇప్పుడు మ‌రోసారి సావిత్రి పాత్ర కీర్తిని వెతుక్కుంటూ వెళ్తుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం మ‌రోసారి సావిత్రి పాత్ర‌లో న‌టించాల్సి వ‌చ్చేలా ఉందిప్పుడు. బాల‌కృష్ణ హీరోగా న‌టించ‌బోయే ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో సావిత్రి పాత్ర కూడా కీల‌క‌మే. ఈ పాత్ర కోసం కీర్తిని త‌ప్ప మ‌రో భామే వ‌ద్దంటున్నాడు క్రిష్. కీర్తిని చూసిన క‌ళ్ళ‌తో సావిత్రి పాత్ర‌ను మ‌రో హీరోయిన్ వేస్తే చూడ‌రంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక నాగేశ్వ‌ర‌రావ్ గా ముందు నాగ‌చైత‌న్య‌ను అనుకున్నా కూడా ఏఎన్నార్ పోలిక‌ల‌తో ఉన్న సుమంత్ అయితే బాగుంటాడ‌ని భావిస్తున్నాడు క్రిష్. అందుకే ఇత‌న్నే నాగేశ్వ‌ర‌రావ్ పాత్ర‌కు ఎంచుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వీలైనంత త్వ‌ర‌గా ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు క్రిష్. మ‌రి చూడాలిక‌.. సావిత్రి.. ఏఎన్నార్ పాత్ర‌లు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఎలా ఉండ‌బోతున్నాయో..? 

More Related Stories