English   

ఎట్టకేలకు తెలుగులో కీర్తి సురేష్ !

Keerthy-Suresh
2019-01-11 09:02:18

గత ఏడాది మహానటి అంటూ మన ముదుకు వచ్చిన తమిళ పొన్ను కీర్తి సురేష్ అప్పటి నుండి తెలుగులో ఇక ఏ సినిమా ఒప్పుకోలేదు. ఆ సినిమా మేలో విడుదలయ్యింది, ఇప్పటి వరకూ మరే సినిమా ఆమె అనౌన్స్ చేయకపోవడంతో నిరాశలో ఉన్న ఆమె అభిమానులకి గుడ్ న్యూస్ చెబుతూ ఆమె కొత్త చిత్రం నిన్న ప్రారంభమయ్యింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు పీఆర్వోగా పని చేస్తూ నిర్మాతగా మారిన మహేష్ కోనేరుకు చెందిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మూడో సినిమా నిన్న హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి నరేంద్ర అనే ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పూజా కార్యక్రమాల తర్వాత కీర్తిసురేష్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కల్యాణ్ రామ్ క్లాప్ కొట్టగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. డైరెక్టర్ హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లేడీ ఓరిఎంటెండ్ సినిమా అని తెలుస్తోంది. సినిమాలో సింహభాగం యుఎస్ లో షూట్ చేయనున్నారట.  డైరెక్ట్ గా గత ఏడాది మహానటి అంటూ వచ్చిన కీర్తి తమిళ్‌ డబ్బింగ్‌ సినిమాలైన సామి, పందెంకోడి2, సర్కార్‌ సినిమాలతోనే గడిపేసింది. మరి మహానటిలానే ఈ సినిమా కూడా తనకు మంచి గుర్తింపునిస్తుందని భావిస్తోంది,

More Related Stories