English   

అదేంటి.. మ‌హాన‌టి సైడ్ అయిపోయింది..!

Keerthy-suresh

మ‌హాన‌టి సైడ్ అయిపోవ‌డం ఏంటి..? ఇప్ప‌టికీ ఈ చిత్రంలో కీర్తిసురేషే క‌దా హీరోయిన్.. ఇంకెవ‌రైనా వ‌చ్చారా ఏంటి అనుకుంటున్నారా..? ఏం లేదండీ.. కీర్తినే ఇప్ప‌టికీ హీరోయిన్ కానీ ఫోక‌స్ మాత్రం మొత్తం స‌మంత వైపు వెళ్తుంది. ఈ సినిమా మొద‌లుపెట్టిన‌పుడు కీర్తిసురేష్ కు చేతినిండా భారీ సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు విడుద‌ల‌య్యే టైమ్ కు అజ్ఞాత‌వాసి.. రైల్.. గ్యాంగ్ లాంటి భారీ ప్లాపులు ఉన్నాయి. దాంతో కీర్తి సైడ్ ట్రాక్ కి వెళ్లింది. ఇదే స‌మ‌యంలో స‌మంత‌కు రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చింది. అందుకే ప్ర‌మోష‌న్ పోస్ట‌ర్స్ లో ఎక్కువ‌గా స‌మంత క‌నిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కీర్తిసురేష్ లుక్ కూడా విడుద‌ల కాలేదు. అస‌లు సావిత్రిగా కీర్తి ఎలా ఉంటుందో అని ఆస‌క్తిగా చూస్తున్నారు ప్రేక్ష‌కులు. కీర్తిసురేష్ ఇమేజ్ ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ స‌మంత క్రేజ్ మాత్రం మ‌హాన‌టికి మ‌హా యూజ్ అవుతుంది. ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర‌వాణిగా న‌టిస్తుంది స‌మంత‌. ఈమె కోణం లోంచే క‌థ సాగుతుంది. ఆమె సావిత్రి క‌థ‌ను చెబుతుంది. ఇక ఆమె ప్రియుడు విజ‌య్ ఆంటోనీగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు. ఈ ఇద్ద‌రి లుక్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచేస్తున్నాయి. సినిమా మే 9న విడుద‌ల కానుంది. అన్న‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు కీర్తిసురేష్ లుక్ బ‌య‌టికి రాలేదు క‌దా.. ఎప్రిల్ 14న ఓ టీజ‌ర్ ప్లాన్ చేస్తున్నారు. దాంతో అభిన‌వ సావిత్రి ఎలా ఉండ‌బోతుందో ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. మ‌రి రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత అయినా త‌న న‌ట‌న‌తో స‌మంత‌ను కీర్తి డామినేట్ చేస్తుందో లేదో చూడాలి..!

More Related Stories