English   

మహానటి వర్సెస్ మహానటి 

Keerthy-Suresh
2018-05-10 07:22:00

మహానటి వర్సెస్ మహానటి.. ఇప్పుడు ఏ నోటా విన్నా ఇదేమాట.. సావిత్రి చినపోయింది కదా.. మళ్లీ ఈ ఇదేం మాట అనుకుంటున్నారా..? అఫ్ కోర్స్..  సావిత్రి మహానటి కాబట్టే ఇప్పుడు ఆమె జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతమైంది. మరి అలాంటి మహానటిని మరోసారి చూపించిన కీర్తి సురేష్ ప్రతిభను మాత్రం ఎలా మర్చిపోతాం. యస్.. అందుకే ఇప్పుడు మహానటి వర్సెస్ మహానటి అంటే ఎవరు గెలిచారు అనేది చెప్పలేం. ఆ మహానటిని కీర్తి సురేష్ అనుకరించి ఉండొచ్చు కాక.. కానీ అనుకరణ కూడా అందరి వల్లా అయ్యేది కాదు. పైగా ఇప్పుడు సావిత్రి బ్రతికి లేదు. కీర్తి పుట్టేనాటికే ఆమె చనిపోయింది. అలాంటి వ్యక్తి పాత్రకు ప్రాణం పోయడం అంటే ఎంత హోమ్ వర్క్ చేసి ఉండాలి. ఎన్ని టేకులు తీసుకున్నా కానీ.. ఆ పాత్రను, ఆ పాత్ర తాలూకూ హావభావాల్ని అచ్చంగా దించడం అంటే అందరి వల్లా అయ్యేది కాదు. ఎంతో ప్రతిభ ఉంటే తప్ప.. సావిత్రి పాత్రను సావిత్రిలానే చేయలేరు.. కానీ కీర్తి చేసింది. చేయడమే కాదు..అచ్చంగా సావిత్రిలానే ప్రవర్తించింది. సావిత్రినే మళ్లీ చూపించింది. 

ఒక రకంగా కీర్తి సురేష్ ది సాహసం. కానీ సాహసాలు చేస్తేనే.. అసాధ్యాలు సాధ్యమవుతాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సావిత్రిని మళ్లీ చూశాం.. అనుకుంటున్నారు. సావిత్రి చెప్పలేని, చెప్పని ఎన్నో విషయాలు దర్శకుడు చెప్పినా.. ఆ సావిత్రి ఆ టైమ్ లో ఎలా ఉంది అన్న ఊహను నిజం చేసింది మాత్రం కీర్తి సురేష్. తను లేని మహానటిని ఊహించలేం అన్నంతగా ఆ పాత్రను ఆవాహన చేసుకుంది. అందుకే ఇప్పుడు మహానటి పాత్రను కూడా ఓ మహానటే చేసింది అన్న పేరు తెచ్చుకుంది. మరి త్వరలోనే జయలలిత బయోపిక్ లోనూ నటించబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. మహానటి చూసిన తర్వాత ఎవరికైనా ఇంకా కీర్తి ఆ పాత్రను చేయలేదు అనే డౌట్స్ ఉంటాయనుకోలేం. సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా.. మహానటిగా కీర్తి సురేష్ కు ఇది లైఫ్ లాంగ్ బెస్ట్ మెమరీ.. 

More Related Stories