English   

పాపం.. కీర్తి క‌ష్టం చూడండి..!

Keerthy-Suresh

జీవితంలో క‌ష్ట‌పడందే ఏదీ రాదు.. అలా వ‌చ్చినా ఎక్కువ కాలం ఉండ‌దు. ఇప్పుడు కీర్తిసురేష్ కూడా త‌న క‌ష్టాన్నే న‌మ్ముకుంది. ఇన్నాళ్ళూ ఆమె ఎన్ని సినిమాలు చేసింది అనేది అన‌వ‌స‌రం.. ఇక‌పై ఎన్ని న‌టిస్తుంద‌నేది కూడా అన‌వ‌స‌రం. ఒక్క సినిమా ఆమె పేరును చిరస్థాయిలో నిలిచేలా చేసింది. అదే మ‌హాన‌టి.. అందులో ఆమె న‌ట‌న చూసి సాక్షాత్తు ఆ సావిత్రే మ‌ళ్ళీ ప్రాణం పోసుకుని వ‌చ్చిందా అంటున్నారు ఇప్పుడు ప్రేక్ష‌కులు. అంత‌గా మ‌హాన‌టి పాత్ర‌లో ఒదిగిపోయింది కీర్తిసురేష్. ఈ చిత్రం ఇంత పెద్ద విజ‌యం సాధించ‌డానికి.. ఆమె న‌ట‌న ఎంత కార‌ణ‌మో ఆమె డ‌బ్బింగ్ కూడా. ఇదే పాత్ర‌కు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్పుంటే ఇంత న్యాచుర‌ల్ గా వ‌చ్చుండేది కాదేమో సినిమా. కానీ కీర్తి త‌న‌కు తెలుగు రాక‌పోయినా కూడా ప‌ట్టుబ‌ట్టి డ‌బ్బింగ్ చెప్పింది. ఇప్పుడు ఆ వీడియో విడుద‌లైంది. ఒక్కో డైలాగ్ కోసం ఆమె ప‌డిన క‌ష్టం క‌నిపిస్తుంది. అంత‌గా క‌ష్ట‌ప‌డింది కాబ‌ట్టే ఈ రోజు ఇంత విజ‌యం సాధించింది మ‌హాన‌టి. ఒక‌టి రెండు రోజులు కాదు.. ఏకంగా మ‌హాన‌టి కోసం 11 రోజులు డ‌బ్బింగ్ చెప్పింది కీర్తి. ఇప్ప‌టికే ఈ చిత్రం 25 కోట్ల మార్క్ అందుకుని.. 30 కోట్ల వైపు ప‌రుగులు తీస్తుంది. ఈ చిత్ర జోరు చూస్తుంటే ఈజీగా 40 కోట్ల మార్క్ అందుకునేలా క‌నిపిస్తుంది. 
 

More Related Stories