English   

 సావిత్రి మ‌ళ్లీ బ‌తికిందా ఏంటి..?

keerthy-Suresh

ఇప్పుడు కీర్తిసురేష్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. మ‌హాన‌టిలో ఒక్కో పోస్ట‌ర్ విడుద‌ల‌వుత‌న్న కొద్దీ సినిమాపై అంచ‌నాలు.. ఆస‌క్తి బాగా పెరిగిపోతున్నాయి. క‌చ్చితంగా ఈ చిత్రం ఏదో సంచ‌ల‌నం సృష్టించేలాగే క‌నిపిస్తుంది. సావిత్రి పాత్ర‌లో కీర్తి క‌నిపించిన విధానం ఇప్పుడు అంద‌ర్లోనూ ఆస‌క్తి పెంచేస్తుంది. మొన్న విడుద‌లైన టీజ‌ర్ లో కొత్త‌ద‌నం అయితే క‌నిపించ‌లేదు కానీ కీర్తిని చూపించిన విధానం న‌చ్చింది. ఇక ఇప్పుడు రిలీజైన స్టిల్స్ లో అలా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని అలా న‌డిచొస్తుంటే నిజంగానే సావిత్రి మ‌ళ్లీ బ‌తికొచ్చిందా అన్న‌ట్లుంది. అంత‌గా ఆ పాత్ర‌ను ఓన్ చేసుకుని న‌టించింది కీర్తిసురేష్. పూర్తిగా చంద్ర‌ముఖిలా మారిపోయిన గంగ‌ను చూడండి అన్న‌ట్లు.. పూర్తిగా సావిత్రిగా మారిపోయిన కీర్తిసురేష్ ను చూడండి అనాలేమో ఇప్పుడు ఈ స్టిల్స్ చూస్తుంటే. మ‌రి రేపు సినిమాలో ఇంకెంత‌గా ప్రేక్ష‌కుల‌ను కీర్తి మాయ చేస్తుందో చూడాలిక‌..! మే 9న మ‌హాన‌టి విడుద‌ల కానుంది.

More Related Stories