English   

అనగనగా ఒక మహానటి

Mahanati-teaser
2018-04-15 09:32:28

అనగనగా ఒక మహానటి అంటూ మొదలైన మహానటి టీజర్ అదిరిపోయింది. కీర్తి సురేష్ సావిత్రి పాత్రను ఆవాహన చేసుకున్నట్టుగా ఈ టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ లోనే సమంత, విజయ్ దేవరకొండ కనిపించే ఈ టీజర్ చాలా విషయాలు చెప్పింది. సావిత్రిగా కీర్తి సురేష్ మేకోవర్ అదిరిపోయింది. పర్ఫెక్ట్ లుక్ తో ఉంది కీర్తి. ఇక ఈ టీజర్ చూస్తే దర్శకుడి ప్యాషన్ కనిపిస్తుంది. అతను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మహానటిని తెరకెక్కించాడనే విషయం డాక్టర్ చక్రవర్తి పోస్టర్ నుంచి బ్లాక్ అండ్ వైట్ షాట్స్ వరకూ తెలిసిపోతుంది. సావిత్రి, జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు పత్రికల్లో వచ్చిన వార్తలు, ఫోటోస్, ఆమెను చూడ్డానికి జనం, మీడియా ఎగబడే విధానం అన్నీ.. ఆ కాలాన్ని ప్రతిబింబిస్తుండటం విశేషం. టీజర్ లో దేవదాసు, మాయాబజార్, డాక్టర్ చక్రవర్తి, మిస్సమ్మ వంటి సినిమాలకు సంబంధించిన కథాంశం కనిపిస్తోంది. ఇక ఫినిషింగ్ లో భర్తతో కలిసి కూతురును ముద్దాడే సీన్ హైలెట్ గా కనిపిస్తోంది. అయితే టీజర్ లో సమంత, విజయ్, దుల్కర్ సాల్మన్ తప్ప ఇతర పాత్రలకు సంబంధించిన వివరాలేవీ లేవు. అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పాత్రలు ముఖ్యం కదా. అలాగే జమున ఆ కాలం నటీనటులు వీళ్లు అని చెప్పుకునేలా ఎవరూ కనిపించలేదు. కాకపోతే ఫస్ట్ టీజర్ కాబట్టి కాన్ సెంట్రేషన్ అంతా సావిత్రి పాత్రపైనే పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ దర్శకుడు నాగ అన్వేష్ అందరూ అనుకున్నంత ఆషామాషీగా మహానటిని తెరకెక్కించలేదు అన్న విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. 

More Related Stories