English   

ఇక చూసుకోండి నా ప్రతాపం అంటున్న కీర్తి సురేష్..

keerthy suresh
2020-09-22 12:42:22

నేను శైలజ సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. దానికంటే ముందు ఐనా ఇష్టం నువ్వు అనే సినిమా చేసింది. కానీ అది విడుదల కాలేదు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటిటి లో ఈ సినిమా విడుదలవుతుంది. ఇదిలా ఉంటే సావిత్రి బయోపిక్ మహానటి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేస్తుంది కీర్తి సురేష్. ఈ క్రమంలోనే ప్రస్తుతం మిస్ ఇండియా, గుడ్ లాక్ సఖి సినిమాలు చేస్తుంది. దాంతోపాటు నితిన్ హీరోగా వస్తున్న రంగ్ దే.. సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాటలో కూడా ఎంపికైంది కీర్తి సురేష్. ఈ మధ్య ఈమె నటించిన పెంగ్విన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. దీనికి సరైన రెస్పాన్స్ రాలేదు. అయినా కూడా అయిన తర్వాత సినిమాలు మళ్ళీ డిజిటల్ వేదికపైనే విడుదల కానున్నాయి. 

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బై లింగువల్ సినిమాలు తెలుగు సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ ఇకపై తమిళ ఇండస్ట్రీలో సత్తా చూపించాలని ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికే అక్కడ విజయ్ సర్కార్, విశాల్ పందెంకోడి 2, విక్రమ్ సామి 2 లాంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు మరిన్ని స్ట్రెయిట్ తమిళ సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అందుకే అక్కడి కథలు వింటుంది. ఇకపై రాబోయే రోజుల్లో తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా పక్కాగా చేయాలని నిర్ణయించుకుంది కీర్తి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సినిమాలు తమిళనాట సైన్ చేసింది కీర్తి సురేష్. ఇది మాత్రమే కాదు ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుసగా చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఏదేమైనా కూడా ఇకపై తమిళ తెలుగు ఇండస్ట్రీలో రెగ్యులర్ గా సినిమాలు చేస్తానంటుంది కీర్తి. మరి ఈమె ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. 

More Related Stories