English   

కీర్తి సురేష్.. నో ఎక్స్‌పోజింగ్.. ఓన్లీ యాక్టింగ్..

suresh
2020-03-28 20:00:59

నేను శైలజ, నేను లోకల్ లాంటి సంచలన విజయాలతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కీర్తి సురేష్.. ఆ తర్వాత అజ్ఞాత‌వాసి లాంటి దారుణ‌మైన డిజాస్ట‌ర్ కూడా చూసింది. కానీ మహానటి సినిమాతో ఈమె కెరీర్ మారిపోయింది. అప్పటి వరకు కీర్తి సురేష్ అంటే అందర్లాంటి హీరోయిన్ అనుకున్నారు కానీ ఆ తర్వాత ఈమెలో చాలా విషయం ఉందని అర్థమైపోయింది. మధ్యలో స్టార్ హీరోల మోజులో పడి అజ్ఞాతవాసితో పాటు సూర్య గ్యాంగ్ లాంటి సినిమాల్లో కూడా ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని రోల్స్ చేసింది కీర్తి. కానీ ఆ త‌ర్వాత మ‌హాన‌టితో ఈమె క్రేజ్ ఆకాశానికి వెళ్లింది. అందులో సావిత్రి అమ్మ‌లా అచ్చంగా న‌టించి ఆమెను గుర్తు చేసింది ఈమె. దాంతో కీర్తిసురేష్ అంటే ఇది నిరూపించుకుంది ఈ భామ‌. ఈ సినిమాతో గౌర‌వాన్ని కూడా ద‌క్కించుకుంది కీర్తిసురేష్. తెలుగులో ఈ చిత్రం త‌ర్వాత సినిమాలేవీ చేయ‌క‌పోయినా కూడా ఇప్ప‌టికీ కీర్తిని మోడ్ర‌న్ మ‌హాన‌టిగానే చూస్తున్నారు ప్రేక్ష‌కులు. కానీ ఇలాంటి టైమ్ లో కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో బొమ్మ‌లా నిల‌బ‌డే హీరోయిన్ పాత్ర‌లు చేసి తాను ఇమేజ్ చెడగొట్టుకోలేనని చెబుతుంది కీర్తి. అందుకే అంద‌ర్లాంటి హీరోయిన్ పాత్రలు చేయనంటుంది. మహానటి తర్వాత సామి 2తో పాటు పందెంకోడి 2, సర్కార్ లాంటి సినిమాల్లో అక్కడక్కడ కనిపించే పాత్రలే చేసింది. కానీ ఇప్పుడు మాత్రం క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర అయితేనే చేస్తానంటుంది కీర్తి. ప్రస్తుతం మిస్ ఇండియాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి మన దగ్గర కేవలం నటనే కానీ అందాల ఆరబోత లేదమ్మా అంటుంది కీర్తి. ఎక్స్ పోజింగ్ చేయకపోయినా కూడా కీర్తి మాత్రం కీర్తి బాగానే సంపాదించుకుంటుంది.

 

More Related Stories