English   

కీర్తిసురేష్ ఎక్కువ టేకులు తీసుకుంటుందా..?

Keerthy Suresh Taken a lot of Takes for Perfect Dubbing
2018-08-06 20:25:33

మ‌హాన‌టి సినిమాతో కీర్తిసురేష్ లో ఎంత‌టి న‌టి ఉందో అర్థం అయిపోయింది అంద‌రికీ. ఈ సినిమాతో మోడ్ర‌న్ మ‌హాన‌టి అయిపోయింది కీర్తిసురేష్. ఈమె కంటే ఆ పాత్ర‌లో ఇంకెవ‌రూ బాగా న‌టించ‌లేర‌ని తేల్చేసారు ప్రేక్ష‌కులు కూడా. కీర్తి న‌ట‌న‌కు అంత‌గా అభిమానులు వ‌చ్చేసారు. ఈ సినిమా చూసిన త‌ర్వాత కీర్తి న‌ట‌న‌కు పేరు పెట్టాలంటే భ‌య‌ప‌డుతున్నారు. పైగా సినిమాలో చాలా వ‌ర‌కు సావిత్రి పాత్ర‌లో లీన‌మైపోయి సింగిల్ టేక్ లోనే న‌టించేసింది అని అప్ప‌ట్లో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా చెప్పాడు. కానీ కీర్తిసురేష్ మాత్రం త‌ను టేకులు కేకులు తిన్న‌ట్లు తినేసాన‌ని చెబుతుంది. అయితే ఈమె టేక్స్ తీసుకుంటున్న‌ది షూటింగ్ లో కాదు.. డ‌బ్బింగ్ లో.

త‌న సినిమాలో తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటే ఉండే కిక్కే వేరు అంటుంది కీర్తి. దానికోసం కాస్త ఎక్కువ స‌మ‌యం తీసుకున్నా ప‌ర్లేదు కానీ చెప్తానంటుంది ఈ భామ‌. మ‌హాన‌టి కోసం ఏకంగా 11 రోజుల పాటు డ‌బ్బింగ్ థియేట‌ర్ లోనే ఉంది కీర్తి. ఓ సినిమా కోసం ఇన్ని రోజులు డ‌బ్బింగ్ చెప్ప‌డం చిన్న విష‌యం కాదు. ప్ర‌తీ ఉఛ్చార‌ణ స‌రిగ్గా ఉండాలంటే.. కెమెరా ముందు న‌టించిన దానికంటే మైక్ ముందే ఎక్కువ‌గా న‌టించాల్సి వ‌స్తుంద‌ని చెబుతుంది కీర్తిసురేష్. ఎంత‌చేసినా చివ‌రికి త‌న సొంత డ‌బ్బింగ్ తో సినిమా చూస్తే వ‌చ్చే ఫీలింగ్ వేరంటుంది ఈ మోడ్ర‌న్ మ‌హాన‌టి. అజ్ఞాత‌వాసి నుంచి సొంత డ‌బ్బింగ్ మొద‌లుపెట్టింది కీర్తి.

More Related Stories